కొద్ది రోజులుగా వన్డే క్రికెట్ మ్యాచ్‌ను తలపిస్తోన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడి నియామకం దాదాపు పూర్తయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును పార్టీ అధినాయకత్వం నియమించినట్టు తెలుస్తోంది.
బాబును ఎదుర్కొనే దూకుడు స్వభావం, అటు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉండడంతో ఫైనల్‌గా కన్నా, పైడికొండల, పురందేశ్వరి పేర్లను తోసిరాజని ఆయనకే అధిష్టానం ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించినట్టు తెలుస్తోంది. సోము ఎంపికలో మెయిన్‌గా టీడీపీ, చంద్రబాబు టార్గెట్టే బీజేపీ టార్గెట్‌గా తెలుస్తోంది. ఇక ఇటీవల పదవికి రాజీనామా చేసిన హరిబాబును ఇప్పటికే జాతీయ కార్యవర్గ సభ్యునిగా అధిష్టానం నియమించింది. ఏపీ బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న సోము ఏపీ బీజేపీ పగ్గాలు చేపడితే ఏపీలో టీడీపీ వర్సెస్ బీజేపీ మధ్య విమర్శల ఫైటింగ్ మామూలుగా ఉండదు. ఇక ఏపీలో బలంగా ఉన్న కాపు వర్గానికి చెందిన వీర్రాజుకు పగ్గాలు ఇవ్వడం ద్వారా అటు కులాల ఈక్వేషన్లను కూడా బీజేపీ పాటించిందని అర్థమవుతోంది. ఈ కులాన్ని తమ వైపునకు తిప్పుకునే ప్లాన్‌లో కూడా ఇది భాగంగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ – బీజేపీ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఈ రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ఏపీ ప్రత్యేక హోదా పోరాటం ముమ్మరమైంది. అటు టీడీపీతో పాటు ఇటు విపక్షాలు, మరో వైపు జనసేన బీజేపీని టార్గెట్‌గా చేసుకుని తీవ్రంగా ఫైట్ చేస్తున్నాయి. ఏకంగా సీఎం హోదాలో చంద్రబాబు దీక్షకు దిగుతున్నారు. మరోవైపు ఏపీ జనాలందరికి బీజేపీ పెద్ద టార్గెట్ అయిపోయింది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ పగ్గాలు చేపట్టడం అనేది ఎవరికి అయినా పెద్ద సవాల్‌గానే మారింది.రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి నుంచి కంభంపాటి హరిబాబు తప్పుకున్నారు. హరిబాబు పదవి నుంచి తప్పుకోవడం వెనక ఆయన అయితే టీడీపీ, చంద్రబాబును ఢీకొట్టలేరని పార్టీ అధిష్టానమే ఆయన్ను తప్పించేలా చేసిందన్న టాక్ కూడా ఉంది. ఇక సోము వీర్రాజు అయితే ముందు నుంచి టీడీపీ, చంద్రబాబును పదే పదే టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు.