YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం తెలంగాణ

వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేన్ స్లాట్ బుకింగ్ ప్రారంభించిన సీఎస్

వ్యవసాయేతర ఆస్థుల రిజిస్ట్రేన్ స్లాట్ బుకింగ్ ప్రారంభించిన సీఎస్

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ లాంఛనంగా శుక్రవారం బిఆర్ కెఆర్ భవన్ లో ప్రారంభించారు.  ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు గారి విజన్ మేరకు  హైకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ద్వారా పారదర్శకంగా, సులభతరంగా, ఎటువంటి విచక్షణ లేకుండా ఆన్ లైన్ పద్ధతి ద్వారా  జరుగుతాయని సి.యస్ తెలిపారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభమైన పద్ధతిలో ఆస్తుల విలువల కనుగుణంగా ఆన్ లైన్ పద్ధతిలో, నెట్ బ్యాంకింగ్ ద్వారా చలాన్ కనుగుణంగా చెల్లింపులు చేసుకొని తదనంతరం బుక్ చేసుకున్న స్లాట్ కు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళవలసి ఉంటుందని సి.యస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించి పాత చార్జీలే అమలు లో ఉన్నాయన్నారు. రిజిస్ట్రేషన్ చేయవలసిన ప్రాపర్టీ వివరాలు నమోదు చేయగానే సిస్టం ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీ, స్టాంపు డ్యూటి, ఇతర చార్జీల చెల్లింపు వివరాలు    జనరేట్ అవుతాయన్నారు. ఆధార్ ఇవ్వని వారికోసం ప్రత్యేక పద్ధతిని పాటిస్తామన్నారు.

ప్రస్తుతం ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు 24 స్లాట్ లను కేటాయిస్తామని, డిమాండ్ మేరకు వాటిని పెంచడం జరుగుతుందన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు వార్ రూం లో పనిచేస్తున్న టెక్నికల్ టీం పరిష్కరిస్తుందని సి.యస్ తెలిపారు.

స్లాట్ బుకింగ్ కోసం టీపిన్, పీటీన్ ఎసెస్స్మెంట్ నెంబర్ లను ఫీడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇవి లేని వారు స్థానిక సంస్థలకు  ధరఖాస్తు చేయగానే 2 రోజులలో వారికి అధికారులు  నెంబరును జారీ చేస్తారన్నారు. ప్రస్తుతం 96 శాతం నుండి 97 శాతం దాకా రిజిస్ట్రేషన్ సర్వీసులను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న సమయానికి అనుగుణంగా కొనుగోలుదారులు, అమ్మకం దారులు, సాక్షు లు తమ ఐడి ప్రూఫ్ ల తో హాజరుకావలసి ఉంటుందన్నారు.

ప్రస్తుతం సేల్, మార్టిగేజ్ విత్ పొసెషన్, మార్టిగేజ్ విత్ అవుట్ పొసెషన్, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్, గిఫ్ట్, డెవలప్ మెట్ అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్ విత్ అవుట్ పొసెషన్ లాంటి సర్వీసులు లభిస్తాయని సి.యస్ తెలిపారు.

డాటా సిస్టమ్ కు సంబంధించి అవసరమైన సెక్యూరిటి వ్యవస్ధను ఏర్పాటు చేసామన్నారు. 24 లైన్ల తో కాల్ సెంటర్ పనిచేస్తుందన్నారు. కాల్ సెంటర్ నెంబర్ 18005994788 కు ఫిర్యాదు చేస్తే ఐటి శాఖ పరిష్కరిస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లకు ప్రత్యేకంగా ధరఖాస్తు చేసుకొనుటకు అవకాశం కల్పించామని సి.యస్ తెలిపారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఈ పాస్ బుక్  జారీ అవుతుందని, 7 నుండి 10 రోజుల లోపు రెగ్యులర్ పాస్ బుక్  జారీ చేయడం జరుగుతుందన్నారు. ప్రజల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.

వ్యవసాయ రిజిస్ట్రేషన్ కు సంబంధించి 55216 లావాదేవీలు జరిగాయని, ధరణికి 1.24 కోట్ల హిట్స్ వచ్చాయని, 74 వేల స్లాట్ బుకింగ్ లు జరిగాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి  జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ శాఖ సిఐజి  శేషాద్రి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి  రిజ్వీ, ఎస్సీ డెవలప్ మెంట్ కార్యదర్శి  రాహుల్ బొజ్జా, తదితరులు పాల్గొన్నారు.

Related Posts