YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ద్వారా ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ద్వారా ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కోప్పుల ఈశ్వర్

ప్రజలచే ఎన్నుకోబడి, నియోజకవర్గ అభివృద్దికి అహర్నిశలు కృషిచేయడంలో ప్రధాన నాయకులైన శాసనసభ్యులకు శాశ్వత చిరునామా ఎర్పాటయిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ధర్మపురి నియోజక వర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి  ప్రారంభించారు.  ఈ సందర్బంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ,ఈ క్యాంప్ కార్యాలయం ద్వారా ప్రజల సమస్యలు  తోరగా పరిష్కారించబడుతాయని తెలిపారు. ప్రభుత్వ ప్రదానకార్యదర్శి కన్న ఎక్కువ బిజిగా ఉండే శాసనసభ్యులకు, స్వేచ్చాయుత వాతవరణంలో  ప్రజల సమస్యలు పరిష్కరించబడాలనే ఉద్దేశ్యంతొ, ముఖ్యమంత్రి   కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,  శాసనసభ్యులకు స్థానిక నియోజక వర్గంలో క్యాంపు కార్యాలయాన్ని ఎర్పాటు చేయండంతో పాటు సిబ్బందిని కూడా నియమించి ప్రజలకు మరింత చేరువ చేశారని అన్నారు.

 

క్యాంపు కార్యాలయ నిర్మాణానికి 50 లక్షలు మంజూరు కాగ, మరికొన్ని నిధులను సమకూర్చుకొని, కోటి రూపాయలతో శాసన సభ్యులతో పాటు, కార్యాలయనికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో నిర్మాణాన్ని పూర్తిచేసుకొవడం జరిగిందని అన్నారు.  సమస్యల పరిష్కారం కొరకు ఎవరైన స్వేచ్చగా రావచ్చని,  ఉదయం 8 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో పిఏ ను,  కంప్యూటర్ ఆపరేటర్ ను నియమించడం జరుగుతుందని, వారు వచ్చిన ప్రతి దరఖాస్తును నేరుగా నాకు అందజేస్తారని, దరఖాస్తుతో పాటు నేరుగా నాతో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పిచడం జరుగుతుందని  పేర్కొన్నారు.  మొదటిరోజైన  ఈరోజు కళ్యాణలక్ష్మి లబ్దిదారులు 50 మంది లబ్దిదారులకు 50లక్షల 5వేల 8వందల రూపాయలను, ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా 46 మంది లబ్దిదారులకు 12 లక్షల 81 వేల చేక్కులను పంపిణి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.  కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ కార్యక్రమాల ద్వారా పెళ్లి సమయంలో ఆడపిల్లల తల్లితండ్రులకు బాసటగా నిలిచి ఆర్థిక సహయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.

 

పథకం పక్కదారిపట్టి, తప్పులు జరిగే అవకాశం లేకుండా వచ్చిన ప్రతిదరఖాస్తును తహసీల్దార్, శాసన సభ్యుల దృవీకరణలతొ లబ్దిదారులకు అందించడం జరుగుతుందని అన్నారు. శాసనసభ్యుల దృవీకరణ ద్వారా ఆపద సమయంలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహయనిధి సహయాన్ని అందించడం జరుగుతుందని,  నెలలో 700 వందల ముఖ్యమంత్రి సహయనిధి  దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, వచ్చిన ప్రతి దరఖాస్తును పరిస్కరించడం జరుగుతుందని పేర్కోన్నారు.  స్వీకరించే ప్రతిదరఖాస్తును క్షుణంగా పరిశీలించి ఎటువంటి పొరపాట్లు లేకుండాచూసి లబ్దిదారునికి త్వరగా సహయాన్ని అందించాలనే సంకల్పంతొ కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయంలో,  హైదరాబాద్ లో ప్రత్యేక సిబ్బంది నియమించడం జరిగిందని పేర్కోన్నారు.  నియెజక వర్గంలొ ఎవరు కూడా మద్యవర్తిత్వం జరుగకుండా చూసి నేరుగా నా కార్యాలయం ద్వారా దరఖాస్తులును స్వీకరించి సహయాన్ని అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.  ఆపద సమయంలో ఉన్న వారిని ఆదుకోవడంలో నేను మాత్రమే కాకండా, నా కార్యాలయ సిబ్బందిద్వారా పూర్తిసహకారాన్ని అందించడం జరుగుతుందని, అవసరమైతె ఆసుపత్రి వరకు వెళ్లి కావలసిన సహకారాన్ని అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.   స్థానికంగా అందుబాటులో లేకపోయిన ప్రజావసరాలను దృష్యా ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడా  సమావేశాలు నిర్వహించేలా  ఎర్పాట్లుచేయడం జరుగుతుందని పేర్కోన్నారు.


జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ,  ప్రతి నియోజక వర్గ కేంద్రంలో శాసన సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రతినియోజక వర్గంలో ఎమ్యేల్యే క్యాంపు కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో బాగంగా ధర్మపురి నియోజక వర్గంలో గౌరవ మంత్రివర్యుల క్యాంపు కార్యాలయాన్ని నేడు ప్రారంభించుకోవడం జరుగుతుందని అన్నారు.  నియోజక వర్గ ప్రజలు వారి  సమస్యలను స్థానిక ఎమ్మేల్యే  క్యాంపు కార్యాలయంలో ఎమ్మేల్యేలకు గాని ఎమ్యేల్యేలు అందుబాటులో లేనిసమయంలో క్యాంపు కార్యాలయంలో నియమించిన అధికారులకు నివేదించుకునే అవకాశం ఉటుందని పేర్కోన్నారు.   మండలం వారిగా ముఖ్యమంత్రి, సహయ నిధి, కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను దరఖాస్తులు ఎక్కడ పెండింగ్ లేకుండా పూర్తిచేసి అందజేయడంలో మంత్రివర్యులు, వారి సిబ్బంది కీలకపాత్ర వహిస్తూన్నారని పేర్కొన్నారు.  


పెద్దపల్లి  పార్లమెంట్ సబ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత, కోరుట్ల శాసన సబ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల శాసనసభ్యులు డా. యం. సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి దావ వసంత, డిసియంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సంగి సత్తెమ్మ, జట్పిటిసిలు, యంపిపిలు, సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్ లు,  పాల్గోన్నారు.

Related Posts