YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

5000 కోట్ల నికర విలువ ఉంటే ఎయిర్ ఇండియా కొనుక్కోవచ్చు

5000 కోట్ల నికర విలువ ఉంటే ఎయిర్ ఇండియా కొనుక్కోవచ్చు

ఎయిర్ ఇండియాను నిర్వహించగల సమర్థత ఉన్న ఏ సంస్థ అయినా ఆ జాతీయ విమానయాన సంస్థలో 76 శాతం వాటా కొనుగోలుకు ముందుకు రావచ్చని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ ఎసెట్ మేనేజ్‌మెంట్ కోరుతోంది. నష్టాలతో నడుస్తున్న ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మెమొరాండం విడుదల చేసింది. వాటా కైవసం చేసుకునే సంస్థను మేనేజ్‌మెంట్ కంట్రోల్‌ను కూడా బదలీ చేస్తామని తెలిపింది. రుణ భారంతో కుంగుతున్న జాతీయ విమానయాన సంస్థలో వాటా కొనుగోలుకు విమానయాన పరిశ్రమలోని సంస్థలతోపాటు కంపెనీల నుంచి కూడా చెప్పుకోతగిన స్పందన లభించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అధికారి ఒకరు చెప్పారు. ఎయిర్ ఇండియాను స్వాధీనపరచుకునేందుకు ఒక విమానయాన సంస్థే రావాలని మేం ఏమీ ఎదురు చూడడం లేదు...(అవసరైవెున) నికర విలువ, నిధులు ఉన్న ఎవైరెనా సరే ఎయిర్ ఇండియా కోసం బిడ్ చేయవచ్చని  నీరజ్  చెప్పారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు బిడ్డర్  ఆర్థిక సామర్థ్యాన్నే ప్రభుత్వం ప్రధాన గీటురాయిగా పెట్టుకుందని ఆయన తెలిపారు.విమానయాన సంస్థను నడిపే సత్తా కూడా బిడ్డర్‌కు ఉండాలని అన్నారు. పోటీపడేవారికి కనీసం రూ. 5000 కోట్ల నికర విలువ ఉండాలని, కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్న తేదీ నాటికి ముందర ఐదు ఆర్థిక సంవత్సరాలలో మూడింటిలో పన్నుల చెల్లింపు తర్వాత లాభాలను నమోదు చేసి ఉండాలని బిడ్ డాక్యుమెంట్ పేర్కొంటోంది. బిడ్లు సమర్పించేందుకు మే14ను చివరి తేదీగా ప్రకటించారు. ఈ దేశీయ విమానయాన సంస్థను స్వాధీనం చేసుకునే సంస్థ, ఎయిర్ ఇండియా వ్యాపార కార్యకలాపాలకు ‘ఎయిర్ ఇండియా’ బ్రాండ్ పేరును కనీసం కొద్ది ఏళ్ళపాటు కొనసాగించవలసి ఉంటుంది. నిర్దిష్టంగా ఎన్ని ఏళ్ళు అనే సంఖ్యను ప్రతిపాదనకు అభ్యర్థన (ఆర్.ఎఫ్.పి) దశలో వెల్లడిస్తారు. సంస్థలు విడిగాను కొనుగోలు ప్రతిపాదనలు సమర్పించవచ్చు లేదా కొన్ని సంస్థలు కన్సార్టియం (సముదాయం)గా ఏర్పడి సమర్పించవచ్చు.  బ్యాంక్, వెంచర్ క్యాపిటలిస్టు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ లేదా ఫండ్‌తో కలసి ఆ కన్సార్టియంను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆసక్తి చూపిన పోటీదార్లు అడిగిన ప్రశ్నలను ఆధారం చేసుకుని ప్రభుత్వం దాని స్పందనను తెలియజేస్తుందని ఆ అధికారి చెప్పారు. ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానాలను అనుసరిస్తుందని, కనుక రిట్రెంచ్‌మెంట్‌పై కలత చెందాల్సిన పని లేదని ఆయన అన్నారు. ఎయిర్ ఇండియాలో ప్రభుత్వం 24 శాతం వాటా అట్టేపెట్టుకుంటుంది. ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకునేవారు దానిలో కనీసం మూడేళ్ళపాటు పెట్టుబడులు కొనసాగించాలి. ఈ లావాదేవీతో ఎయిర్ ఇండియాతోపాటు, దాని తక్కువ వ్యయ విభాగం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, సంయుక్త రంగంలోని ఎయిర్ ఇండియా శాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా కొనుగోలు సంస్థ వశమౌతాయి

Related Posts