YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పోలవరం... సవరించిన ఆమోదాలుకు కేంద్రం ఓకే

పోలవరం... సవరించిన ఆమోదాలుకు కేంద్రం ఓకే

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, నిధులపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఆమోదించాలని విన్నవించారు. 2017-18 సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌తో ఏపీ మంత్రుల భేటీ అయ్యారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని ఏపీ మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్, ఎంపీలు కలిశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, నిధులపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఆమోదించాలని విన్నపించారు. 2017-18 సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు.. కేంద్ర ఆర్థిక శాఖ వద్ద అంచనాల పెంపు వ్యవహారం పెండింగ్‌లోఉందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రి నిర్మలా సీతారామన్‌ను పలుమార్లు కలిసి అంచనాల పెంపుపై చర్చించినట్లు ప్రస్తావించారు.పోలవరం ప్రాజెక్ట్ నిధులు సమకూర్చేందుకు కేంద్రం సానుకూలమన్నారు మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్. ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ 15 రోజుల్లో వస్తానన్నారని.. ప్రాజెక్ట్ మారిన అంచనాలకు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించనున్నాయి అంటున్నారు. త్వరలోనే కేంద్రం నుంచి తీపి కబురు వస్తుందని భావిస్తున్నారు.అంతేకాదు పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2,234.28 కోట్లను నాబార్డు శుక్రవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్యూడీఏ)కు విడుదల చేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రీయింబర్స్‌మెంట్‌ కింద ఎన్‌డబ్యూడీఏ ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక ఖాతాలో ఒకట్రెండు రోజుల్లో జమచేయనున్నారు. 3, 4 రోజుల్లో నిధులు ఏపీ ప్రభుత్వ ఖాతాలో జమ అవుతాయి.

Related Posts