టీటీడీ సర్వర్లు మళ్లీ మొరాయించాయి. 25న రానున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 2 లక్షల మంది భక్తులకు ఆన్ లైన్ టికెట్లను విక్రయించడం ద్వారా, పది రోజుల వ్యవధిలో వారందరికీ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందుకోసం ఆన్ లైన్ లో టికెట్లను విడుదల చేసింది. అయితే అరగంట సేపు పనిచేసిన తర్వాత ... సర్వర్లు మొరాయించడంతో భక్తులు నిరాశకు గురయ్యారు..రోజుకు 20 వేల టికెట్లను భక్తులకు విక్రయిస్తామని, ఆగమ శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకున్న మీదటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరచివుంచాలన్న నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. నేటి నుంచి ఆన్ లైన్ లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.