YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు దేశీయం

చిత్ర ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

చిత్ర ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

బుల్లితెర నటి వి.జె.చిత్ర ఆత్మహత్య కేసు అనేక మలుపులు తీసుకుంటోంది. చిత్ర ఆత్మహత్య చేసుకుందని పోస్టుమార్టం రిపోర్టులో తేలినా... ఆమె తల్లిదండ్రులు, బంధువులు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు. తమ కూతురిని అల్లుడే తీవ్రంగా కొట్టి చంపేశాడని చిత్ర తల్లి విజయ గురువారం ఆరోపించారు. పోస్టుమార్టం చిత్ర మృతదేహానికి బీసెంట్‌ నగర్ శ్మశాన వాటికలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెది ఆత్మహత్యేనని డాక్టర్లు, పోలీసులు తేల్చినా పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రోజూ తిరువాన్మియూరులోని ఇంటి నుంచే షూటింగ్‌కు వెళ్లే చిత్ర.. నాలుగు రోజులుగా హోటల్లో భర్తతో కలిసి హోటల్‌లో ఎందుకు ఉంది?, ఆమె మొహంపై గాయాలు ఎందుకున్నాయి?, పెద్దల సమక్షంలో నిశ్చితార్థం నిర్వహించి, పెళ్లికి ముహూర్తం నిశ్చయించినా.. హేమంత్ .. చిత్రను తొందరపెట్టి రిజిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. రెండ్రోజులుగా చిత్ర భర్త హేమంత్ రవిని విచారిస్తున్న పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. పూందమల్లి అసిస్టెంట్‌ కమిషనర్‌ సుదర్శనం నేతృత్వంలో స్పెషల్ టీమ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.
చిత్రచిత్రతో సన్నిహితంగా ఉండే నటీనటులు, ఫ్రెండ్స్‌తో పాటు.. పాండియన్‌ స్టోర్స్‌ యూనిట్‌ను విచారించేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. పోస్టుమార్టం నివేదికలో ఆత్మహత్య అని తేలినా.. అందుకు బలమైన కారణమే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే హేమంత్‌పై చిత్ర తల్లి సంచలన ఆరోపణలు చేశారు. నిశ్చితార్థం అయ్యే వరకు హేమనాథ్‌ పద్ధతిగానే ఉన్నాడని, ఆ తర్వాతే అతడి నిజస్వరూపం బయటపడిందని విజయ ఆరోపించారు. వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తనా.. చిత్ర తమకు ఏనాడూ చెప్పలేదన్నారు.తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, భర్తే ఆమెను తీవ్రంగా కొట్టి చంపేసి ఉండొచ్చని విజయ ఆరోపించారు. చిత్ర స్నేహితురాలు శరణ్య మాట్లాడుతూ.. చిత్ర తనతో ఎప్పుడూ వ్యక్తిగత సమస్యల గురించి చెప్పలేదని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు అప్పుడప్పుడూ చెప్పేదని తెలిపింది. మరోవైపు 'పాండియన్ స్టోర్స్' సీరియల్ పాత్ర విషయంలో చిత్రతో హేమంత్ గొడవపడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఓ రాజకీయ ప్రముఖుడి కారు హోటల్‌కి వచ్చినట్లు కొత్త ప్రచారం జరుగుతోంది.

Related Posts