YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరులో టీడీపీ నేతలపై వైసీపీ దాడి

చిత్తూరులో టీడీపీ నేతలపై వైసీపీ దాడి

బి.కొత్తకోటలో మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ఘటన జరిగింది. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు, ఆస్పత్రికి తరలించారు. టీడీపీ నేతలకు చెందిన 4 కార్లు ధ్వంసమయ్యాయి.చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలపై దాడి కలకలంరేపింది. కురబలకోట మండలం అంగళ్లులో నేతల కార్లపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడికి దిగారు. బి.కొత్తకోటలో మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా ఘటన జరిగింది. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు, ఆస్పత్రికి తరలించారు. టీడీపీ నేతలకు చెందిన 4 కార్లు ధ్వంసమయ్యాయి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, రాజంపేట టీడీపీ శ్రీనివాసరెడ్డి కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. రంగంలోకి దిగిన పోలీసులు కిషోర్‌కు అడ్డుగా నిలిచార. ఈ దాడిని ఖండిస్తూ టీడీపీ నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నల్లారి కిషోర్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నేతల దాడిఘటనను తీవ్రంగా ఖండించారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్చేశారు. జగన్ ఫాసిస్ట్ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయని.. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా గండికొట్టారని మండిపడ్డారు. జగన్ అండతో వైసిపి ఫాసిస్ట్ మూకలు రెచ్చిపోతున్నాయని.. ఏ నేరానికి పాల్పడినా ఎవరేం చేయరనే ధీమాతో నిందితులంతా పేట్రేగిపోతున్నారన్నారు. జగన్ సీఎం అయ్యాక పోలీసు వ్యవస్థ మారిందని.. పేదలు, సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది అన్నారు.ట్విట్టర్ వేదికగా లోకేష్ మండిపడ్డారు. 'జగన్ జంగిల్ రాజ్యంలో ప్రజలకు, ప్ర‌తిప‌క్షనేత‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. చ‌నిపోయిన టిడిపి కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించేందుకు టిడిపి నేతలు న‌ల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, శంక‌ర్‌యాద‌వ్‌లు వెళ్తుండ‌గా వైఎస్సార్‌సీపీ కార్య‌క‌ర్త‌లు కాన్వాయ్‌పై దాడి చేసినా, పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించ‌‌డం చూస్తుంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని అరాచ‌క ప్ర‌దేశ్‌గా మార్చేశార‌ని అర్థమ‌వుతోంది. ఫ్యాన్ గుర్తు అధినేత నుంచి కార్య‌క‌ర్త వ‌ర‌కూ అంద‌రూ ఫ్యాక్ష‌న్ మ‌న‌స్త‌త్వం ఉన్నవారే.. పోలీసుల‌కేమైంది? ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుని వైఎస్సార్‌సీపీ కోసం ప‌నిచేయ‌డం సిగ్గుచేటు. మీరు ప్ర‌జార‌క్ష‌క‌భ‌టులా? ప్రజలపై క‌క్ష‌క‌ట్టిన భటులా?'అంటూ ట్వీట్ చేశారు.

Related Posts