YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ రాజకీయాలకు దూరంగా జీవీఎల్

ఏపీ రాజకీయాలకు దూరంగా జీవీఎల్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇటీవల కాలంలో కొంత స్లో అయ్యారు. ప్రధానంగా ఏపీ రాజకీయాల విషయంలో ఆయన పెద్దగా తలదూర్చడం లేదు. పోలవరం విషయంలోనూ పెద్దగా స్పందించలేదు. దీనికి ప్రధాన కారణం తనపై వైసీపీ ముద్ర పడటమే కారణమంటున్నారు. గతంలో దూకుడు మీద ఉండే జీవీఎల్ నరసింహారావు ఏపీ పాలిటిక్స్ లో జోక్యం చేసుకోకపోవడానికి ప్రధానంగా టీడీపీ యే కారణమన్న కామెంట్స్ వినపడుతున్నాయి.ఒక రకంగా జీవీఎల్ నరసింహారావు ను కట్టడి చేయడంలో టీడీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి.

జీవీఎల్ నరసింహారావు జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనను ఒకసారి కలిశారు. అంతేకాకుండా వైసీపీకి అనుకూలంగా ఉంటారన్న విమర్శలూ ఉన్నాయి. ప్రధానంగా జీవీఎల్ నరసింహారావు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేస్తారని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా టీడీపీ జీవీఎల్ ను ట్రోల్ చేసేది.జగన్ బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ కు జీవీఎల్ నరసింహారావు దగ్గర బంధువంటూ టీడీపీ సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై జీవీఎల్ వివరణ ఇచ్చుకున్నారు. తనకు బ్రదర్ అనిల్ కుమార్ కు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ సోషల్ మీడియా మాత్రం జీవీ‌ఎల్ నరసింహారావును ఎప్పటికప్పడు కార్నర్ చేస్తూనే ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో జీవీఎల్ కొంత స్లో అయ్యారంటున్నారు.

దీంతో పాటు సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడయ్యాక అంతా ఆయనే చూసుకుంటున్నారు. టీడీపీని వదిలపెట్టడం లేదు. పోలవరం విషయంలోనూ చంద్రబాబు చేసిన తప్పులను సోమువీర్రాజు ఎత్తి చూపుతూ వస్తున్నారు. పార్టీని దశాబ్దకాలాల నుంచి రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేసిన చంద్రబాబును సోము వీర్రాజు వదలిపెట్టడం లేదు. దీంతో జీవీఎల్ నరసింహారావు ఇక తనకు పని లేదని ఆయన మౌనంగా ఉన్నారని కూడా చెబుతున్నారు. మొత్తం మీద జీవీఎల్ నరసింహారావు మెత్తబడటానికి టీడీపీ సోషల్ మీడియానే కారణమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి

Related Posts