YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

34 ఏళ్ల తర్వాత మహేష్

34 ఏళ్ల తర్వాత మహేష్

ప్రిన్స్ మహేష్ బాబు, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ భారీ అంచనాలతో సందడి చేస్తోంది. ఈమూవీలో మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. ‘భరత్ అనే నేను’.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ ప్రమాణం చేస్తూ ఫస్ట్ వోథ్‌తో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. అయితే ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ మూవీ విడుదల నేపథ్యంలో మహేష్ అభిమానులు ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్‌ని వెతికి పట్టుకున్నారు. అదే సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘ముఖ్యమంత్రి’ మూవీ పోస్టర్.సరిగ్గా 34 ఏళ్ల క్రితం నాటిది ఆ పోస్టర్. చలనచిత్రాకాశంలో ధృవతార, కింగ్ ఆఫ్ కలెక్షన్ హీరో కృష్ణ నటించిన ‘ముఖ్యమంత్రి’ చిత్రం విడుదలైన తొలి వారంలోనే రూ. 52,13,169 వసూలు చేసి రికార్డు కలెక్షన్లతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ చిత్రానికి క్రిష్ణ భార్య విజయ నిర్మల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కృష్ణ ముఖ్యమంత్రిగా నటించారు. సరిగ్గా 34 ఏళ్ల తరువాత ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండటం ఈ రెండు చిత్రాల పోస్టర్లు అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కృష్ణ ముఖ్యమంత్రిగా బ్లాక్ బస్టర్ హిట్ 34 ఏళ్ల క్రితమే కొట్టేశాడు

Related Posts