YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

కోదండరామ్ ఒంటరయిపోయాడే

కోదండరామ్ ఒంటరయిపోయాడే

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆయన గత కొంతకాలంగా మౌనంగా ఉండటానికి కారణాలేంటి? అన్న దానిపై చర్చ జరుగుతోంది. కోదండరామ్ తెలంగాణ జనసమితిని ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ కూటమికి దగ్గరయ్యారు. అయితే అది కూడా వర్క్ అవుట్ కాలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఢీకొట్టేందుకే కోదండరామ్ కాంగ్రెస్ తో కలసి మహాకూటమిని ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత కోదండరామ్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఆయన దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకూ కోదండరామ్ దూరంగా ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీతో ఆయనకు గ్యాప్ పెరగడమే. కాంగ్రెస్ రోజురోజుకూ రాష్ట్రంలో బలహీన పడుతుండటం, బీజేపీ పుంజుకుంటుండటంతో కోదండరామ్ పునరాలోచనలో పడినట్లు తెలిసింది.మరోవైపు కోదండరామ్ పెద్దలసభలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆయన జనగామ నుంచి బరిలోకి దిగాల్సి ఉన్నా పొన్నాల లక్ష్మయ్య ఉండటంతో ఆయన తప్పుకున్నారు. దీంతో ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచి ఆయన బరిలోకి దిగాలని నిర్ణయించారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు మద్దతిచ్చే అంశంపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. అయినా కోదండరామ్ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.తనకు మద్దతిస్తాయని భావించిన వామపక్ష పార్టీలు సయితం తమ అభ్యర్థిని ప్రకటించాయి. ఇక మిగిలింది టీడీపీయే. కోదండరామ్ కు టీడీపీ మద్దతిచ్చే అవకాశాలు మాత్రం కన్పిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కొంత పట్టున్న టీడీపీ అవసరం కోదండరామ్ కు ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా కోదండరామ్ ను గత కొంత కాలం నుంచి దూరంపెట్టడంతో ఆయన తన సొంత ఇమేజ్ తోనే బరిలోకి దిగి నెగ్గాలనుకుంటున్నారు. మొత్తం మీద కోదండరామ్ ఈ ఎన్నికల్లోనైనా గెలిచి పెద్దల సభలోకి అడుగుపెడతారో? లేదో? చూడాల్సి ఉంది.

Related Posts