పఠాన్ చేరు నియోజ కవర్గం లో గత కొన్ని రోజులుగా పఠాన్ చేరు జాతీయ రహదారి పక్కన జరిగిన అక్రమ నిర్మాణాల పై వస్తున్న వరుస కథనాలకు జీహెచ్ఎంసీ అధికారులు స్పందించారు.పటాన్ చెరు జాతీయ రహదారి నీ ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు తీసుకున్న ఆకస్మిక నిర్ణయం తో బాధితులు బోరుమంటున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలను జిహెచ్ఎంసి ఆర్ అండ్ బి పోలీసు శాఖ మరియు రెవెన్యూ యంత్రాంగం సంయుక్తంగా అక్రమ నిర్మాణాలను తొలగించారు ఇదిలా ఉండగా దశాబ్దాలుగా ఇంటి పన్నులు చెల్లిస్తు కరెంట్ మీటరు పొంది జీవనం సాగిస్తున్న ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని బాధితులు వాపోతున్నారు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలు చేపట్టడం పై స్థానిక బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు పునరావాసం కల్పించాలని బాధితులు కోరుతున్నారు.