YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

పేదల ఇళ్లకోసం సీపీఐ అందోళన

పేదల ఇళ్లకోసం సీపీఐ అందోళన

పట్టణ పేదలకు పక్కా ఇళ్ళు నిర్మించేం దుకు గత తెలుగుదేశం పార్టీ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీప్లస్త్రీ గృహాల కేటాయింపులు చేయకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరి స్తుందని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే.రామకృష్ణ ఆరోపించారు. పట్టణ పేదలకు టిడ్కో ద్వారా కేటాయించిన జీప్లస్త్రీ గృహాలు త్వరితగతిన అందించాలని కోరుతూ సీపీఐ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు నిచ్చింది. కార్యక్రమంలో భాగంగా విజయవాడలో సీపీఐ పార్టీ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు.గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టణ పేదలకు ఇళ్లు ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీప్లస్త్రీ నిర్మాణాలు ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారాయన్నారు. టీడీపీకి పేరు వస్తుందన్న కుంటిసాకులతో లబ్ధిదారులకు అన్యాయం చేస్తుందన్నారు.

Related Posts