YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎమ్మెల్యేలకే జగన్ మార్కులు

ఎమ్మెల్యేలకే జగన్ మార్కులు

జగన్ ఈ సంగతి గమనించారో లేదో కానీ ఆయన ఎంపిక చేసి తీసుకున్న మంత్రులు పాతిక మంది దాకా ఉన్నారు. అయితే వారిలో చాలా మంది కంటే కూడా ఎమ్మెల్యేలు అసెంబ్లీ కానీ బయట కానీ బాగా మాట్లాడుతున్నారు. రాజకీయంగా సమర్ధంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒకరు. ఆయన అసెంబ్లీలో ప్రతీ సారీ అద్భుతమైన ప్రసంగమే చేస్తున్నారు.

ఆయన గాలి మాటలు మాట్లాడంలేదు. ఒకరిని నిందించడంలేదు. సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ లైన్ దాటకుండా వెళ్తున్నారు. అందరి ప్రసంగాలకు అల్లరి చేసే టీడీపీ కూడా ధర్మాన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నది అంటే అందులో సుతి మెత్తని ఎత్తిపొడుపులు తప్ప తిట్ల పురాణాలు లేవు, ఎవరినీ విమర్శించినదీలేదు.ఇక మరో సీనియర్ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా మీడియా ముందు మాట్లాడాలన్నా, అసెంబ్లీలో విపక్షానికి ధీటుగా జవాబు చెప్పాలన్నా ముందుంటారు. ఆయన ప్రసంగం కూడా వినబుద్ధి వేస్తుంది. దానికి కారణం ఆయన చమత్కారాలు, చమక్కులతో మాట్లాడుతారు. అందువల్లనే ఆయన చంద్రబాబుని విమర్శించినా కూడా ఆయన సీరియస్ గా తీసుకోరు. ఇదే విధంగా విశాఖ నుంచి కరణం ధర్మశ్రీ కూడా చక్కగా మాట్లాడుతారని పేరు.

ఇక ఎమ్మెల్యే ఆర్ కె రోజా కూడా గట్టిగానే మాట్లాడుతారు. ఇలా మాట్లాడే ఎమ్మెల్యేలు వైసీపీలో చాలా మంది ఉన్నారు.ఇక మంత్రులుగా జగన్ తీసుకున్న వారిలో ఇప్పటికీ చాలా మంది తడబడుతూనే ఉన్నారు. సబ్జెక్ట్ విషయంలో గట్టిగా సాధన చేయడంలేదు. విపక్షానికి ఇక్కడే వీరు దొరికిపోతున్నరు అంటున్నారు. మంత్రులుగా కురసాల కన్నబాబు కొత్తగా వచ్చినా కూడా బాగా మాట్లాడుతున్న సీదరి అప్పలరాజు వంటి వారున్నారు. కానీ మెజారిటీ మాత్రం పాఠాలే అప్పచెబుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

మరి సామాజిక సమీకరణలు తూకాలు చూసుకుని మంత్రులను ఎన్నుకున్న వైసీపీ అధినాయకత్వం వారి పెర్ఫార్మెన్స్ విషయంలో మెరుగుదలకు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఏడాదిన్నర గడచినా విపక్షం దాడి నుంచి తప్పించుకోలేపోతుంది అంటున్నారునిజానికి రాజకీయాల్లో ప్రతిభ ఎంత ఉండాలి అన్న దానికి కొలమానం లేదు. ఒక్కోసారి అధికంగా రాణించినా కూడా అదే మైనస్ అవుతుంది. పెదవి దాటిన పన్ను అవుతుంది. అందువల్ల కూడా సమర్ధులకు అవకాశాలు రావడంలేదు అంటున్నారు. అయితే మరీ పాతిక మంది కాకపోయినా కొందరినైనా ధాటీగా మాట్లాడేవారిని,సబ్జెక్ట్ మీద పట్టున్న వారినీ మంత్రులుగా తీసుకుంటే రాజకీయంగానే కాదు బయట తటస్థ ప్రజనీకం వద్ద మంత్రి మండలికి మంచి మార్కులు పడతాయి. మరో పది నెలల్లో మంత్రి వర్గం విస్తరణ అంటున్న జగన్ ఈసారి ఏ కొలమానాలు అనుసరిస్తారో చూడాలి.

Related Posts