YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

పొలిటికల్ ప్రొఫెసర్ గా చంద్రబాబు

పొలిటికల్ ప్రొఫెసర్ గా చంద్రబాబు

పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన చంద్రబాబు రాజకీయాల్లోకి రాకుంటే ఏం చేసేవారో తెలియదు కానీ ఆయన మాత్రం మంచి లెక్చరర్ గా ఉండేవారేమోనని ఆయన ఇచ్చే ఉపన్యాసాలు విన్నవారు కామెంట్స్ చేస్తూంటారు. చంద్రబాబు యువకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇపుడు పొలిటికల్ గా ప్రొఫెసర్ స్థాయికి చేరుకున్నారు. ఆయన టీడీపీ తమ్ముళ్ళకు క్లాసులు తీసుకుంటూంటారు. అది ఆయన బాధ్యత కూడా. కానీ ప్రత్యర్ధి పార్టీకి చెందిన నాయకులకు కూడా పాఠాలు చెబుతాను అంటూ ముందుకు రావడమే ఇపుడు విడ్డూరమూ, విశేషమూనూ.ముఖ్యమంత్రి అయినా కూడా జగన్ కి ఫండమెంటల్స్ ఏమీ తెలియవు అని చంద్రబాబు అనేస్తున్నారు. జగన్ అంతకు ముందు కూడా రాజకీయంగా పెద్దగా చురుకుగా లేరని, ఆయనకు అనుభవం ఎక్కడిది అని చంద్రబాబు నిలదీస్తున్నారు. ఆయన చేస్తున్న చట్టాలు కోర్టుల్లో కొట్టివేతలకు గురి అవుతున్నాయి. దిశ చట్టాన్ని కేంద్రం వెనక్కి తిప్పి పంపింది. వీటిని దృష్టిలో ఉంచుకుని బాబు హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ కి పాలనాపరమైన అవగాహన లేకనే ఇలా జరుగుతోందని అంటున్నారు.ఏడాది అసెంబ్లీలో ఆమోదించిన దిశ చట్టంలో ఎన్నో లోపాలు ఉన్నాయని నాడే గుర్తించి తాను వాటిని చెబుతూంటే జగన్ వినలేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. జగన్ కి అవగాహన లేమితో పాటు వినే తత్వం కూడా లేదని బాబు విమర్శిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చాలా నేర్చుకోవాలని కూడా చంద్రబాబు అంటున్నారు. తనకున్న అనుభవంతో ఇందంతా చెబుతున్నానని, జగన్ పాలనాపరంగా తప్పులు చేస్తున్నారని నిందిస్తున్నారు చంద్రబాబు.చంద్రబాబు పాఠాలు చెప్పడానికి మాస్టారు అవతారం ఎత్తారు, అసెంబ్లీలోనే చెప్పడానికి చూస్తున్నారు. మరి జగన్ ఆ పాఠాలను వినడానికి సిధ్ధంగా ఉన్నారా అంటే అదెలా కుదురుతుంది అని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు దృష్టిలో జగన్ ని ఎపుడూ ఏమీ తెలియదు అనే అంటారు. కానీ జనం మెచ్చి పగ్గాలు అప్పగించారు. జగన్ ప్రజారంజకమైన పాలన సాగిస్తున్నారు అని వారు అంటున్నారు. దాని చూసి ఓర్చుకోలేకనే బాబు ఇలా కొత్త పద్ధతిలో నిందిస్తున్నారని అంటున్నారు. బాబు జగన్ మీద చేసిన విమర్శలు పక్కన పెడితే కొత్తగా నెగ్గిన ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలనలో తమ సత్తా చూపిస్తున్న సంగతి కూడా దేశంలో ఉంది. ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ ఏ అనుభవం లేకుండానే బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నారు అలాగే అప్పట్లో ఎన్టీయార్ కనీసం పేపర్ కూడా చూసేవారు కాదని అంటారు. ఆయన కూడా మంచి పాలనే అందిచారు. రాజకీయాల్లో పాఠాలు చెప్పే అసలైన గురువులు జనమే అన్న సంగతి చంద్రబాబు సహా అంతా గుర్తుంచుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికల వేళ బాబు తప్పులు చూసే కదా జనం ఫెయిల్ చేశారు అని అంటున్నారు. మొత్తానికి బాబుకు జగన్ ఏమీ తెలియని వాడు అయినా జనం వేసే మార్కులే అసలైన రిమార్కులు అన్నది మాత్రం నిజం.

Related Posts