YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

నిల‌క‌డ‌గా బుద్ధ‌దేవ్ భ‌ట్టాచార్య‌ ఆరోగ్య ప‌రిస్థితి

నిల‌క‌డ‌గా బుద్ధ‌దేవ్ భ‌ట్టాచార్య‌ ఆరోగ్య ప‌రిస్థితి

ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి, సీపీఐఎం నాయ‌కుడు బుద్ధ‌దేవ్ భ‌ట్టాచార్య‌(76) ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు సౌత్ కోల్‌క‌తా ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న భ‌ట్టాచార్య‌ను కుటుంబ స‌భ్యులు బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఆస్ప‌త్రిలో చేర్పించారు. ఆ రోజు నుంచి మెకానిక‌ల్ వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందిన మాజీ సీఎం.. శుక్ర‌వారం రాత్రి నుంచి నాన్ ఇన్వాసివ్ వెంటిలేష‌న్‌(ఎన్ఐవీ)పై చికిత్స పొందుతున్నారు. గ‌త రాత్రి నుంచి ఆయ‌న ఆరోగ్య‌క‌రంగా ఉన్న‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. భ‌ట్టాచార్య బీపీ, ప‌ల్స్, ఆక్సిన్ శాచురేష‌న్ స్టేబుల్‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా బుద్ధ‌దేవ్ భ‌ట్టాచార్య 2000 నుంచి 2011 వ‌ర‌కు కొన‌సాగారు. గ‌త కొద్ది సంవ‌త్స‌రాల నుంచి భ‌ట్టాచార్య‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ప్ర‌జా సేవ‌కు దూరంగా ఉంటున్నారు.

Related Posts