YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అన్ని పార్టీలు తలైవా వైపు చూపు

అన్ని పార్టీలు తలైవా వైపు చూపు

చెన్నై, డిసెంబర్ 14, 
రజనీ కాంత్ తమిళనాడులో ఎంత సంచలనం సృష్టిస్తారో తెలియదు కాని, ఆయన పార్టీ ప్రకటించిన వెంటనే మాత్రం అన్ని పార్టీలూ అప్రమత్తమయినట్లే కన్పిస్తున్నాయి. రజనీకాంత్ ఒంటరిగా పోటీ చేయరని తేలిపోయింది. ఆయన ప్లాన్ ప్రకారం తమిళనాడు కు చెందిన కొన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. తనపై నాన్ లోకల్ ముద్ర వేస్తుండటం కూడా ఇందుకు కారణం. అందుకే రజనీకాంత్ తాను ముఖ్యమంత్రి పదవిని కోరడం లేదని చెప్పారంటున్నారు.రజనీకాంత్ పార్టీ కోసం ఇప్పటికే అన్ని పార్టీలూ ఎదురు చూస్తున్నాయి. వాటన్నింటిని కలుపుకుని రజనీకాంత్ ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారు. కానీ అలా చేస్తే రజనీకాంత్ కు భవిష‌్యత్ లో ఇబ్బందులు ఎదురవుతాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కొత్త పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని క్యాడర్, నేతలూ కోరుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినందువల్ల గుర్తు కూడా ప్రజల్లోకి బలంగా వెళుతుందన్న అభిప్రాయం పార్టీలో కూడా వ్యక్తమవుతోంది.కానీ రజనీకాంత్ మాత్రం ఒంటరిగా వెళ్లే సాహసం చేయరంటున్నారు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో కూటమితోనే వెళ్లాలన్నది రజనీకాంత్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కమల్ హాసన్ కూడా తృతీయ కూటమి ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. కానీ రజనీకాంత్ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయంటున్నారు. ఆయన బీజేపీ కూటమి వైపునకు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు.తొలి నుంచి రజనీకాంత్ బీజపీ పట్ల కొంత సానుకూలతతో ఉన్నారు. ఆధ్యాత్మిక రాజకీయాలు నడుపుతానని చెప్పడం వెనక కూడా కాషాయం కథ ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. తమిళనాడులో సహజంగా ద్రవిడ సిద్ధాంతాలు, పెరియార్ నాస్తిక వాదాలు ఎక్కువ. ఇటువంటి పరిస్థతుల్లో రజనీకాంత్ బీజేపీతో కలిస్తే నెగ్గుకు రాగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ తొలి నియామకమే ఆ అనుమానాలను మరింత పెంచింది. పార్టీ ముఖ్య సమన్వయకర్తగా అర్జున్ మూర్తిని రజనీకాంత్ నియమించారు. అర్జున్ మూర్తి గతంలో బీజేపీ మేధోవిభాగం తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే అన్నాడీఎంకే కూటమితో వెళతారా? లేక బీజేపీతో కలసి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

Related Posts