YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

హైదరాబాద్, డిసెంబర్ 14, 
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వంపై ఎంతగా అసహనం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేందుకు నియామకాల అంశం కూడా ఓ కీలకమైనది కాగా.. ఇప్పటి వరకూ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంపై తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా నిరుద్యోగులందరికీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆయా శాఖల్లో ఖాళీలను గుర్తించాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.భాగంగా ఉపాధ్యాయ, పోలీసులతో పాటు ఖాళీ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఆ పోస్టులన్నీంటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో కొన్ని వేల మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసులను నియమించుకోవాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Related Posts