YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కమలం వైపు మాజీలు

కమలం వైపు మాజీలు

హైదరాబాద్, డిసెంబర్ 14, 
బీజేపీలోకి ఇక చేరికలు షురూ కానున్నాయి. పెద్దయెత్తున వలసలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ బీజేపీ లోకి వద్దామా? లేదా? అన్న మీమాంసలో ఉన్న వారు సయితం బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. చేరికలకు కూడా పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనపడుతుంది. ఇప్పటికే విజయశాంతి బీజేపీలో చేరిపోయారు. విజయశాంతితో పాటు మరికొందరు మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రులు కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారన్న టాక్ వినపడుతుంది.దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో బీజేపీపై నమ్మకం పెరిగింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే కనపడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దయెత్తున వలసలు ఉండే అవకాశముంది. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలపడంతో ఆ పార్టీ అప్రమత్తమయింది.అయినా సరే ఇక కాంగ్రెస్ లో ఉండి సాధించేదేమీ లేదని భావించిన కొందరు నేతలు బీజేపీ సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దశల వారీగా వీరికి పార్టీ కండువాలను కప్పేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. అధికార టీఆర్ఎస్ పై ఇటీవల జరిగిన ఎన్నికలలో పెద్దయెత్తున అసంతృప్తి బయటపడటంతో బీజేపీ కి అవకాశాలున్నాయని భావించిన ఒక మాజీ ఎంపీ ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సంకేతాలను కూడా పంపారు.మాజీ ఎంపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మాజీ మంత్రులు సయితం కమలం బాట పట్టే అవకాశముంది. వచ్చే ఎన్నికల నాటికి కనీసం వంద స్థానాల్లో బలపడాలన్నది బీజేపీ నిర్ణయం. అందుకోసమే వంద స్థానాల్లో బలమైన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకోవాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించిందనితెలుస్తోంది. ఇటీవల అమిత్ షా, నడ్డాలతో బండి సంజయ్ జరిపిన సమావేశంలో కూడా ప్రధానంగా చేరికలపై చర్చించినట్లు తెలిసింది.
మేకపోతు గాంభీర్యం
టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది. అవినీతి ప్రభుత్వం అంతమవుతుంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని ఆయన జోస్యం చెబుతున్నారు. ఇది శాపనార్థాలయితే పరవాలేదు కాని. జోస్యం మాత్రం కాకూడదు. ఎందుకంటే దుబ్బాక లో గెలిచిన ఊపుతో అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీవైపు క్యూ కడతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.వారి లెక్క ప్రకారం దాదాపు 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వస్తారని చెబుతున్నారు. ఇది ప్రచారం మాత్రమే. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వైపు మొగ్గు చూపుతారని బీజేపీ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. తాము బలమైన ప్రతిపక్షంగా రాష్ట్రంలో మారతామని పదే పదే చెబుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా? అన్న సంగతిని మాత్రం బీజేపీ నేతలు విస్మరిస్తున్నారు.
నిజానికి సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరూ అధికార పార్టీ నుంచి విపక్షం వైపు చూసే అవకాశం ఉండదు. అధికారంలో ఉండటానికే వారు ఎక్కువగా ఇష్టపడతారు. పైగా జీహెచ్ఎంసీ ఎన్నికలు కేవలం హైదరాబాద్ కే పరిమితం. గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఈ ఫలితాల గురించి పెద్దగా పట్టదు. పట్టించుకోరు కూడా. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా ముప్ఫయి మంది బీజేపీ లో చేరడమనేది కలలోనే ఊహించుకోవాలి తప్పించి ఆచరణలో సాధ్యం కాదన్నది బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి.
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలయి ఉండవచ్చు. అందుకు అనేక కారణాలున్నాయి. అధికార పార్టీపై వ్యతిరేకత కూడా కొంత కారణం కావచ్చు. అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు అయి ఉండవచ్చు. అంత మాత్రాన టీఆర్ఎస్ తుడిచిపెట్టుకు పోతుందనయితే నమ్మేంతటి నేతలు ఆ పార్టీలో ఎవరూ లేరనే చెప్పాలి. బీజేపీ ప్రచారం చేసుకోవడానికి, కొంతకాలం సంతృప్తి పడటానికి మాత్రం ఇది ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Related Posts