YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

53 ఏళ్ల తర్వాత గ్రంధాలయానికి కొత్త హంగులు

53 ఏళ్ల తర్వాత గ్రంధాలయానికి కొత్త హంగులు

మెదక్, 

52 ఏళ్ల తర్వాత గ్రంధాలయానికి కొత్త హంగులు సిద్ధమౌతున్నాయి.సంగారెడ్డి జిల్లా గ్రంథాలయం సరికొత్త హంగుల్ని సంతరించుకుంటోంది.. కలెక్టర్‌ చొరవతో సమస్యలనుంచి బయటపడుతోంది.. అత్యాధునిక గదులు, అన్నిరంగాలకు సంబంధించిన పుస్తకాలతో ఇక్కడ అడుగుపెట్టగానే కొత్త ప్రపంచంలోకి వెళ్లామన్న అనుభూతి కలిగేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. త్వరలో ఈ లైబ్రరీ ప్రారంభం కానుంది. ఒకప్పుడు సంగారెడ్డి గ్రంథాలయం అంటే ఎవ్వరికీ తెలిసేది కాదు.. తెలిసినవారు పుస్తకాలు చదువుకునేందుకు ఇక్కడకు వచ్చినా కనీస సౌకర్యాలులేక వెనుదిరిగేవారు.. . 1965లో ఏర్పాటైన ఈ పుస్తకాలయం మెదక్‌ జిల్లా వాసులకు ఎన్నో పుస్తకాలు చదువుకునే అవకాశం కల్పించింది. ఎంతోమందిని పుస్తకాలద్వారా చైతన్యంచేసిన ఈ గ్రంథాలయాన్ని సమస్యలు చుట్టుముట్టాయి. కనీసం కూర్చునేందుకు కుర్చీలుకూడాలేని దీనస్థితికి చేరింది. పుస్తకాలుకూడా అంతంతమాత్రంగా రావడంతో లైబ్రరీకి జనాల రాక తగ్గింది. వచ్చినవారు వసతులలేమితో అక్కడ ప్రశాంతంగా చదువుకోలేకపోయారు. గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు.. పుస్తకాలయం రూపురేఖలే మార్చేలా చర్యలు చేపట్టారు.. అన్నివర్గాల ప్రజలు చదువుకునే పుస్తకాలు ఇక్కడ లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. దిన, వారపత్రికలు, మామూలు పుస్తకాలతోపాటు.. పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్స్‌నుకూడా అందుబాటులో ఉంచబోతున్నారు. ఈ లైబ్రరీల ఆలోచనకూడా చేస్తున్నారు. చిన్నారులకు డిజిటల్‌ లైబ్రరీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. లైబ్రరీలో సౌకర్యాల కల్పనపై అధికారులు దృష్టిపెట్టారు.. ఇక్కడికివచ్చే పుస్తకప్రియులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, ఫ్యాన్లు, లైట్లను బిగించారు. మంచి గాలి, వెళుతురు వచ్చేలా రీడింగ్‌ హాల్‌, రిఫరెన్స్ హాల్‌ సిద్ధం చేస్తున్నారు. కేవలం పుస్తకాలేకాకుండా లైబ్రరీ ఆవరణనుకూడా మార్చేస్తున్నారు. చుట్టుపక్కల పచ్చని మొక్కలతో కళకళలాడుతూ కనిపించేలా చర్యలు చేపట్టారు. అధికారుల చొరవతో లైబ్రరీకి కొత్త రూపురావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలలేమి నుండి బయటపడ్డ సంగారెడ్డి గ్రంథాలయం త్వరలో ప్రారంభం కాబోతోంది. యువతీ యువకులు, వృద్ధులు, విద్యార్థులు అందరూ చదువుకునే బుక్స్‌ పుస్తకప్రియుల్ని అలరించబోతున్నాయి.

Related Posts