YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఫైజర్ వ్యాక్సిన్ కు భారత్ నో!

ఫైజర్ వ్యాక్సిన్ కు భారత్ నో!

న్యూ ఢిల్లీ డిసెంబర్ 14 
కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం యూకే ప్రభుత్వం వైజర్ వ్యాక్సిన్ ను ఫైతీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను అమెరికా బ్రిటన్ సహా పలు దేశాల్లో వాడకానికి అనుమతి పొందింది. అయితే ఈ వ్యాక్సిన్ కి భారత్ లో ఎదురుదెబ్బ తగలనుంది. ఈ వ్యాక్సిన్ వాడకానికి అనుమతి ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫైజర్ వ్యాక్సిన్ ధర అధికంగా ఉండటం ఈ వ్యాక్సిన్ ను మైనస్ 70 నుంచి 90 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి వుండటమే ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యాక్సిన్ అధిక ధరకుతోడు.. ఫైజర్ తయారీ వ్యాక్సిన్ ను మైనస్ 70-90 సెల్షియస్లో నిల్వ చేయవలసి రావడం సైతం ప్రతికూలంగా పరిణమించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే  ఫైజర్ వ్యాక్సిన్ ధర నిల్వ సమస్యలు పంపిణీ వ్యయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలుకి విముఖత చూపనున్నట్లు ఫార్మా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా ఫైజర్ వ్యాక్సిన్ ను ప్రస్తుతం యూకే బెహ్రయిన్ కెనడాల్లో వినియోగిస్తుండగా యూఎస్ ఎఫ్డీయే సైతం అనుమతులు మంజూరు చేయగా నేటి నుంచి ప్రజలకు టీకా ఇవ్వడం ప్రారంభమైంది. యూఎస్ లో వ్యాక్సిన్ నిల్వ కోసం కోల్డ్ స్టోరేజ్ లను తయారు చేసి స్వయంగా వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. అటువంటి పరిస్థితి ఇండియాలో లేదు. వ్యాక్సిన్ ను స్టోర్ చేసేందుకు ముంబై విమానాశ్రయం కార్గోలో ఏర్పాట్లు చేసినా దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. దీనితో ఫైజర్ వ్యాక్సిన్ పై కేంద్రం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.

Related Posts