పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లోని పెద్ద పంచాయతీలో చిట్టవరం ఒకటి ఖరీఫ్ లో కురిసిన అధిక వర్షాలు వరదలతో ముంపు బారిన పడి వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం రైతులకు అందించేందుకు వ్యవసాయ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి నష్టం అంచనా వేశారు. చివరకు రైతుల ఖాతాలు పంట నష్టం వేసే సమయంలో అర్హులకు పరిహారం అందక పోగా అనర్హులకు లబ్ధి చేకూరింది. దీంతో అన్నదాతలు ఆందోళన చేపట్టి తీగలాగితే తే డొంక కదిలింది. దీనికి కారణాలు వెలికి తీయగా పలు నిజాలు బయటికొచ్చాయి. రైతుల కు వర్తించే నష్టపరిహారం లో తమకు అన్యాయం జరిగిందని రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నత అధికారులకు వినతులు అందజేశారు. దీనికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని ఆందోళన చేశారు. వరి పంటకు నష్ట పరిహారం అందజేసే ఈ విషయంలో 2018 నుంచి నష్టపోయామని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబరు నెలలో కురిసిన భారీ వర్షాలు వరదల నేపథ్యంలో మొదటి పంట నష్టపోయారు. నష్టాలను క్షేత్రస్థాయిలో అంచనా వేసిన దానికి భిన్నంగా ముంపు బారిన పడని పొలాలు లేఅవుట్లు కొబ్బరి తోటలు స్థలాలు కు నష్ట పరిహారం జమ కావడం వాస్తవంగా నష్టపోయిన రైతులకు పరిహారం నమోదు కాకపోవడం అసలు ఏ మాత్రం నష్ట పోనీ రైతులకు వేలల్లో సొమ్ము జమ కావడం విస్మయం కలిగిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారణం విఆర్ఓ కార్యాలయంలో తన తండ్రికి బదులుగా విధులు నిర్వహించే వీఆర్ఏ పోలిశెట్టి నరేంద్ర అ కారణమని రైతులు ఏకరువు పెట్టారు క్షేత్రస్థాయిలో నష్టాల అంచనా ప్రక్రియ సరిగా జరగలేదని ఇందుకు కారణం వ్యవసాయ శాఖ సిబ్బంది అధికారులు కారణమని వారి నిర్లక్ష్యం తో నరేంద్ర నిర్వాహకం తో తాము నిండా మునిగి పోయమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అంశాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని నష్ట పోనీ రైతులకు నష్టపరిహారం జమ చేసి లబ్ధి పొందుతున్న అనధికార వ్యక్తి నరేంద్ర పై చర్య తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.