రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టాక మహిళలకు రక్షణ కరువైందని కడప టీడీపీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షురాలు, టీడీపీ మహిళా నేత శ్వేతారెడ్డి ఆరోపించారు. దిశా చట్టం తెచ్చినా కూడా మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయని విమర్శించారు. సీఎం జగన్ సొంతఊరు పులివెందులలో దళిత మహిళపై అత్యాచారం చేసి చంపితే దిక్కులేదన్నారు. ఆ కేసును కప్పిపుచ్చే విధంగా పోలీసులు ప్రవర్తించారని ఆరోపించారు. కేసును మైనర్లపై నెట్టి కేసు మాఫీ చేసే విధంగా కడప జిల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళలపై గౌరవం ఉంటే.. తక్షణం జోక్యం చేసుకొని అసలు దోషులను శిక్షించాలని శ్వేతారెడ్డి డిమాండ్ చేశారు.