YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని అమరావతిలోనే ఉంటుంది

రాజధాని అమరావతిలోనే  ఉంటుంది

నవ్యాంధ్ర రాజధాని అమరావతి పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నానని  ‘అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది బీజేపీ లక్ష్యం. ఇందులో రెండో అంశానికి తావు లేదని తేల్చేశారు. సోమవారం నాడు గుంటూరు జిల్లా తుళ్లూరులో ‘భారతీయ కిసాన్ సంఘ్’ చిన్న, సన్నకారు రైతుల సమ్మేళనం జరిగింది. అమరావతి గురించి మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏపీ బీజేపీ కార్యాలయం విజయవాడలోనే కడుతున్నాం. సీఎం మూడు రాజధానులు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బీజేపీ.. జగన్ లాగా మాట తప్పం...మడమ తిప్పమని... బీజేపీ మాట తప్పే పార్టీ కాదుని సోము స్పష్టం చేశారు. అమరావతి ఇక్కడే ఉండాలి అని బీజేపీ పార్టీ తరుపున ఉద్యమం చేస్తాం. 2024లో బీజేపీకి ఏపీలో అధికారం ఇవ్వండి. అమరావతిని బాగా అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని వీర్రాజు చెప్పుకొచ్చారు.‘సీఎం వైఎస్ జగన్ వెంటనే రైతు నాయకులతో మాట్లాడాలి. బీజేపీ నాయకులం ఎప్పుడూ రెండు నాలుకలతో మాట్లాడం. రాజధానితో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయాలి. 64వేల ప్లాట్ పోగా మిగిలిన భూమిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారుమోదీ అమరావతి వైపే ఉన్నారనడానికి నిదర్శనం. 1800 కోట్లతో నిర్మితమవుతున్న ఎయిమ్స్ హాస్పిటల్ ఆగిందా?. దుర్గమ్మ ఫ్లై ఓవర్ పూర్తీ చేసామా లేదా?. నేను మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. బీజేపీ.. జగన్ లాగా మాట తప్పం...మడమ తిప్పం. బీజేపీ మాట తప్పే పార్టీ కాదు. అమరావతి ఇక్కడే ఉండాలి అని బీజేపీ పార్టీ తరుపున ఉద్యమం చేస్తాం. 2024లో బీజేపీకి ఏపీలో అధికారం ఇవ్వండి. అమరావతిని బాగా అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని వీర్రాజు చెప్పుకొచ్చారు.‘సీఎం వైఎస్ జగన్ వెంటనే రైతు నాయకులతో మాట్లాడాలి. బీజేపీ నాయకులం ఎప్పుడూ రెండు నాలుకలతో మాట్లాడం. రాజధానితో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయాలి. 64వేల ప్లాట్ పోగా మిగిలిన భూమిని అభివృద్ధి చేయాలి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలోనే ఉంటుంది. దుర్గమ్మ, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌లు, ఎయిమ్స్ బీజేపీ వల్లే వచ్చాయి. అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు కట్టుబడి ఉన్నాం. మోదీ, వీర్రాజు మీతోనే (అమరావతి ప్రజలు)ఉన్నారు. రాష్ర్టంలో అభివృద్ధి మోదీ వల్లే జరిగింది. 2024 సంవత్సరంలో మాకు అధికారం ఇస్తే అమరావతిని రూ. 5000 కోట్లతో అభివృద్ధి చేస్తాం. రైతుల ప్లాట్‌లకు 2000 కోట్లతో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని సోము వీర్రాజు హామీ ఇచ్చారు.

Related Posts