YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం తెలంగాణ

కరోనా పంపిణిపై ప్లాన్

కరోనా పంపిణిపై ప్లాన్

కొవిడ్ టీకా పంపిణీకి సంబంధించి కోఠిలోని డైరెక్ట‌ర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాల‌యంలో అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోల‌తో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. కోల్డ్ చైన్ నిల్వ‌, టీకా ఇవ్వాల్సిన ప‌ద్ధ‌తుల‌పై శిక్ష‌ణ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో యూనిసెఫ్ ప్ర‌తినిధులు కూడా పాల్గొన్నారు. ఏ విధంగా ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయాలి.. ఎవ‌రెవ‌రిని భాగ‌స్వామ్యం చేయాల‌నే అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్బంగా డీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొవిడ్ టీకా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. వ్యాక్సిన్ ఇచ్చేందుకు 10 వేల మంది వ్యాక్సినేట‌ర్ల‌ను సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. వ్యాక్సిన్ ఎప్పుడు వ‌చ్చినా కొవిడ్ బాధితుల‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. 3 కోట్ల డోసుల‌ను నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజీల‌ను సిద్దం చేస్తున్నామ‌ని డాక్ట‌ర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

Related Posts