YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

అప్పుడు వద్దని... ఇప్పుడు ముద్దంటున్న ఐఏఎస్ శ్రీలక్ష్మీ

అప్పుడు వద్దని... ఇప్పుడు ముద్దంటున్న ఐఏఎస్ శ్రీలక్ష్మీ

ఐఎఎస్‌ సీనియర్‌ అధికారి శ్రీలక్ష్మీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డితో  సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇటీవల తెలంగాణ క్యాడర్‌ నుంచి రిలీవ్‌ అయిన శ్రీలక్ష్మీ.. రెండు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్‌ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్టుమెంట్ లో రిపోర్ట్‌ చేశారు. ఎపీకి డిప్యూటేషన్ మీద వచ్చిన ఐఎఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి జగన్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన శ్రీలక్ష్మికి ఎట్టకేలకు ఏపికి వచ్చేందుకు మార్గం సుగమమైంది. జగన్మోహన్‌రెడ్డి విచారణ ఎదుర్కొంటున్న పలు అవినీతి కేసుల్లో ఐఎఎస్‌ అధికారి శ్రీలక్ష్మీ కూడా నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.  జగన్ అక్రమాస్తుల కేసులో  ఆమెను విచారించడానికి సిబిఐకి కేంద్ర ప్రభుత్వం 2013 లో అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి మూడు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. గాలి జనార్థనరెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కార్పోరేషన్ కు అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అక్రమంగా మైనింగ్ లైసెన్సులు ఇచ్చిన కేసులో శ్రీ లక్ష్మి నిందితురాలిగా ఉన్నారు.ఈ కేసులో శ్రీ లక్ష్మిని 2011 నవంబరు 28 వ తేదీన సిబిఐ అరెస్టు చేసింది. ఆమెను చంచల్ గూడ జైలుకి పంపించారు. ఆమె ఆరోగ్యం దిగజారిన దృష్ట్యా 2012 అక్టోబరులో ఆమెకు బెయిల్ లభించింది. ఐదేళ్ల గ్యాప్ తర్వాత, 2016 అక్టోబరు లో  ఆమెకు మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలో పోస్టింగ్ లభించింది. అయితే, 2019 లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు డిప్యుటేషన్ మీద రావడానికి శ్రీ లక్ష్మి చాలా సార్లు ప్రయత్నించారు. ఇందుకోసం ఆమె పలుమార్లు ఢిల్లీ వెళ్లారు. వైసిపి నేతలు, మరీ ముఖ్యంగా ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వి విజయసాయిరెడ్డి, ఢిల్లీలో ఆమెను చాలామంది పెద్దలతో కలిపించి, ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ మీద వెళ్లడానికి సిఫార్సులు చేసినట్టుగా వార్తలు వచ్చాయి.రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం ఆమె అభ్యర్థనను నిరాకరించిన తర్వాత, ఎట్టకేలకు తాజాగా ఆమెకు ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ నేపధ్యంలో సిఎం జగన్ తో ఆమె భేటి అయ్యారు.
అప్పుడు వద్దు... ఇప్పుడు..

ఐఏఎస్  అధికారి శ్రీలక్ష్మీ ఏపీ కేడరుకు రావాలని చాలాకాలంగా పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. క్యాడర్ మార్పునకు క్యాట్ అంగీకరించడంతో అంతా కొలిక్కివచ్చినట్టేనని భావించారు. అయితే శ్రీలక్ష్మీ భవిష్యత్తు ఇప్పటికీ కేంద్రం చేతుల్లోనే ఉంది. డీఓపీటీలో ఆమె విషయం ఇంకా పెండింగులోనే ఉంది. ఇదే ప్రస్తుతం ఏపీ ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీలక్ష్మిని రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించింది కేంద్రం. ఏపీ ప్రభుత్వ పగ్గాలు జగన్ చేపట్టిన తర్వాత, శ్రీలక్ష్మి డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వస్తారని ప్రచారం జరిగింది. సీఎం పేషీలో ఆమె అత్యంత ప్రధానమైన పాత్రను పోషిస్తారనే చర్చ కూడా జరిగింది. ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా వీరిద్దరిని రాష్ట్రానికి రప్పించేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సంప్రదించి.. ఏపీకి పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నారు. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆ ప్రక్రియ పెండింగులో పడిపోయింది. నిబంధనల ప్రకారం ఓ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పేసింది. అయితే శ్రీలక్ష్మీ మాత్రం పట్టు వదలకుండా ఢిల్లీలో తన ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు క్యాట్ ను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏపీకి వెళ్లేందుకు క్యాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీలక్ష్మీని రిలీవ్ చేసింది. దీంతో శ్రీలక్ష్మీ కూడా ఏపీకి వచ్చి జాయినింగ్ రిపోర్ట్ అందచేశారు.ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కానీ.. క్యాట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. డీఓపీటీ ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం ఓ ఆసక్తికర ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ ఏపీలో జాయినింగ్ రిపోర్టు ఇచ్చారని.. క్యాట్ ఆదేశాల ప్రకారం ఆమెను ఏపీ కేడరులోకి తీసుకుంటున్నట్టు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ నెల 10నుంచి ఆమెను ఏపీ కేడరులోకి తీసుకుంటున్నట్టు వెల్లడించింది అయితే ఈ ఆదేశాలు డీఓపీటీ నిర్ణయానికి.. అనుమతికి లోబడి ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. దీంతో శ్రీలక్ష్మీ కోరికను.. క్యాట్ ఆదేశాలను..  డీఓపీటీ ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటు శ్రీలక్ష్మీ.. అటు ప్రభుత్వం కోరుకున్న విధంగా డీఓపీటీ అంగీకరిస్తుందా..? లేక నిబంధనలను సడలించలేమని స్పష్టం చేస్తుందా..? అనేది ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు శ్రీలక్ష్మీని ఏపీకి కేటాయించే విషయంలో కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆమె ఏపీలో కొనసాగడం కష్టమనే చర్చ జరుగుతోంది. అయితే క్యాట్ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి.. దాన్ని చూసైనా డీఓపీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చనేది మరో చర్చ. ఇదే తరహాలో ఏపీ కేడరులో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి క్యాట్ ఆదేశాలతో తెలంగాణకు వెళ్తే అక్కడ సదురు ఐఏఎస్ అధికారికి ఎదురు దెబ్బ తగిలిందని గుర్తు చేస్తున్నారు. అయితే అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం కూడా సదురు అధికారిని తమ రాష్ట్ర కేడరులోకి తీసుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి.. తిరస్కారానికి గురైందని.. కానీ ఇప్పుడు రెండు వైపులా అంగీకారం ఉంది కాబట్టి.. మెలికంతా డీఓపీటీ వద్దే ఉంటుందని అంటున్నారు. ఇదే క్రమంలో మరో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శ్రీలక్ష్మీ ఏపీలో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి.. ఆమెకు ఇప్పుడే పోస్టింగ్ ఇస్తారా..? లేక డీఓపీటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే పోస్టింగ్ ఇస్తారా..? అనేది చూడాల్సి ఉంది. గతంలో ప్రచారం జరిగినట్టు ఆమెను సీఎంఓలోకి తీసుకుంటారా..? లేక వేరే కీలక శాఖ ఇస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. క్యాట్ ఆదేశాలతో శ్రీలక్ష్మీ ఏపీలో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని.. దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం డీఓపీటీకి లేఖ రాసినట్టు సమాచారం.

Related Posts