YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

మత్స్య కారుల మధ్య గొడవలు

మత్స్య కారుల మధ్య గొడవలు

ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో మత్స్సకార గ్రామాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎంపీ మోపిదేవి వెంకట రమణ చీరాల ప్రాంతానికి వెళ్లారు.. అక్కడ మత్స్యకార గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతలు ఉన్నారు. ముందుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.వాడ్రేవులోని మత్స్యకారులను ఎంపీ, నేతలు కలిసి పరిస్థితులపై చర్చించారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని.. చిన్న సమస్యల్ని పెద్దలతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. కటారివారి పాలెంలో మత్స్య కారులతో సమావేశమయ్యారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని.. వారికి సహకరించాలని కోరారు.ఇదిలా ఉంటే ఎంపీ మోపిదేవి పర్యటనలో ఉద్రిక్తత కనిపించింది. మత్స్యకారులు కొంతమంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. రాళ్ల దాడి చేశారు.. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనపర్తి బజ్జిబాబు, కాగితాల సతీష్ అనే ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఈ దాడిలో ఓ కారు ధ్వంసమైంది. ఆ వెంటనే ఎంపీ మోపిదేవి, నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related Posts