YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అనుభవానికి అందలం

అనుభవానికి అందలం

విజయవాడ, డిసెంబర్ 15, 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సహాని కి ఈనెల ఆఖర్లో రిటైర్ కానున్నారు. ఈ నెలాఖరకల్లా ఆమె పదవి కాలం ముగుస్తుంది. దీంతో ఆమెకు ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్య నాథ్ దాస్ కు బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. ఇక నీలం సహాని ని కీలకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల సలహాదారుగా నిర్మించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.ఈ అంశం మీద పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి ఆమె పదవీకాలం ఇప్పటికే ముగిసింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమె పదవీకాలాన్ని పొడిగించింది. మరో మారు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు లేకపోవడంతో ఆమెకు అత్యున్నత సలహాదారు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆమెను కేంద్ర రాష్ట్ర సంబంధాలు సలహాదారుగా ఆమె బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రెటరీ గా ఉండేవారు ఆయన తప్పించి మరి నీలం సాహ్ని రాష్ట్ర రాష్ట్రానికి తీసుకువచ్చారు జగన్. అందుకే ఆమెకు ఈ కీలక పదవి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Posts