YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కమల్, రజనీ చర్చలు...?

కమల్, రజనీ చర్చలు...?

చెన్నై, డిసెంబర్ 15, 
తమిళనాడు రాజకీయాల్లో ఈ ఇద్దరూ కలసి నడిస్తే ఇక తిరుగుండదన్న చర్చ జరుగుతోంది. రజనీకాంత్ జనవరి నెలలో రాజకీయ పార్టీని ప్రకటిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన కూటమితో నే ఎన్నికల బరిలోకి దిగాలన్న యోచనలో ఉన్నారు. రజనీకాంత్ డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు వ్యతిరేకంగా బరిలోకి దిగాాలని భావిస్తున్నారు. అంటే ఇటు కాంగ్రెస్, బీజేపీలకు సమానదూరంగా ఉండాలన్నది రజనీకాంత్ నిర్ణయంగా ఉంది.కమల్ హాసన్ కూడా రజనీకాంత్ తో పొత్తుకు సిద్ధమయినట్లు కనపడుతుంది. ఈ మేరకు సంకేతాలు కూడా వెలువడ్డాయి. అదే జరిగితే తమిళనాడులో ఇద్దరు అగ్రహీరోలు కలసి ఎన్నికల బరిలోకి దిగడం ఇదే తొలిసారి అవుతుంది. సినిమా రంగంలోనూ రజనీకాంత్, కమల్ హాసన్ లు మంచి మిత్రులు. కమల్ హాసన్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టి జనంలోకి వెళ్లారు. అది పెద్దగా సక్సెస్ కాకపోయినా ఆయన కొన్నాళ్లుగా తృతీయ కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారు.రజనీకాంత్ పార్టీపై ఇప్పటి వరకూ స్పష్టత లేకపోవడంతో కమల్ హాసన్ మిగిలిన పార్టీలతో కలసి తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ రజనీకాంత్ నుంచి స్పష్టమైన ప్రకటన రావడంతో కమల్ హాసన్ రజనీతో కలసి నడిచేందుకు సిద్దమయ్యారు. అయితే జనవరిలో రజనీకాంత్ పార్టీని ప్రకటించిన తర్వాతనే ఇద్దరి మధ్య చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మక్కల్ నీది మయ్యమ్ నేతలు చెబుతున్నారు.సీట్ల సర్దుబాటు సమస్య కాబోదని, ఇద్దరు కలిస్తే వార్ వన్ సైడ్ గా ఉంటుందని ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ కూడా కమల్ తో కలసి వెళ్లేందుకే డిసైడ్ అయినట్లు కనపడుతుంది. కమల్ హాసన్ లోకల్ కావడం కూడా ఇందుకు కారణమని చెబుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ లు తృతీయ కూటమి ఏర్పాటు చేస్తే డీఎంకే, అన్నాడీఎంకే కూటముల నుంచి కూడా పార్టీలు ఇటువైపు వచ్చే అవకాశముందంటున్నారు

Related Posts