YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు చంద్రుళ్లకు..కమలం గుబులు

తెలుగు చంద్రుళ్లకు..కమలం గుబులు

హైదరాబాద్, డిసెంబర్ 15,
జగన్ ది రాజకీయంగా పదేళ్ళ వయసు మాత్రమే. ప్రత్యర్ధులు అలా కాదు దశాబ్దాల అనుభవం పండించుకున్న వారు. ఇక జగన్ ది డైరెక్ట్ రూట్. మధ్యలో బ్రేకులుండవు. దూసుకుపోవడమే తెలుసు. ఇక ఒకరితో కయ్యం వస్తే అంతే సంగతులు. ఆ జన్మకు వారి ముఖం చూడడం కూడా కష్టమే. కానీ ప్రత్యర్ధులు అలా కాదు వారు అన్ని ఆప్షన్లు దగ్గరలో ఉంచుకుంటారు. జగన్ వేసే కార్డు ఏంటో ముందే తెలిసిపోతుంది. కానీ ప్రత్యర్ధులు వేసే కార్డే చివరాఖరు వరకూ తేలదు, తెలియదు. అక్కడే మొత్తం బొల్తా కొడుతుంది.గ్రేటర్ ఎన్నికల తరువాత తెలంగాణాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయింది. దాంతో చంద్రబాబుకు ఏపీ మాత్రమే ముఖ్యమన్న సంగతి కూడా తెలిసిపోయింది. తెలంగాణాలో ఏదో మొక్కుబడిగా బాబు పోటీ చేశారు తప్ప ఆయన కానీ కొడుకు లోకేష్ కానీ ఈసారి డైరెక్ట్ గా కేసీయార్ తో తలపడలేదు. అది సానుకూల అంశంగా కేసీయార్ కి పరిణమించింది. అంతే కాదు, ఈసారి కేసీయార్ పార్టీ గెలిచిన సీట్లలో 27 పూర్తిగా సీమాంద్ర ప్రాంతాల నుంచి వచ్చినవే. దాంతో ఆ వర్గం ఓట్లు గుత్తమొత్తంగా కేసీయార్ పరం అయ్యాయి అంటే బాబు సామాజికవర్గం టీయారెస్ ని పూర్తిగా నమ్మినట్లే కదా. దాంతో ఇద్దరు చంద్రుల కలయిక‌కు ఇదే ప్రాతిపదిక అవుతోంది అంటున్నారు.ఇక తెలంగాణాలో కాషాయం పార్టీ కేసీయార్ ని కషాయం తాగిస్తోంది. గుక్కతిప్పుకోలేని విధంగా కేసీయార్ పరిస్థితి ఉంది. ఇక ఏపీలో కూడా బీజేపీ జోరు పెంచుతాను అంటోంది. ముందుగా టీడీపీని పొలిటికల్ గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తాను అని కూడా సవాల్ చేస్తోంది. బీజేపీకి ఏ మాత్రం సానుకూలత కనిపించినా ముందుగా అవుట్ అయ్యేది టీడీపీనే. ఇది బాబుకు తెలియనిది కాదు. అలా కనుక చూస్తే ఇద్దరు చంద్రులకూ కమలం పార్టీ నుంచి ముప్పు తప్పదని అంటున్నారు.చంద్రబాబు, కేసీయార్ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరికీ పదునైన వ్యూహాలు ఉన్నాయి. వాటిని ఎపుడు ఎలా అమలు చెయాలో కూడా తెలిసిన వారు. ఇపుడు ఏపీలో చూస్తే జగన్ మోడీకి దగ్గరగా ఉంటున్నారు. బీజేపీకి చంద్రబాబు అవసరం అయితే లేదు. బాబు ఎంతలా మొరపెట్టుకున్నా కూడా కరుణించడంలేదు. దాంతో కేసీయార్ తో బాబు చేతులు కలిపితే అర్జంటుగా చాలా లాభాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ ని దెబ్బ తీసే ధైర్యం వస్తుంది. అంతే కాదు, ఎంఐఎం వంటి పార్టీల అండ దొరికితే జగన్ మైనారిటీ ఓటు బ్యాంక్ కూడా చిల్లుపడుతుంది. ఇక ఇద్దరూ కలసి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో జగన్ తో ఒక ఆట ఆడుకోవచ్చు. జగన్ ఏపీ సీఎం కాబట్టి బాబు కేసీయార్ అండతో ముప్పతిప్పలు పెట్టవచ్చు. బీజేపీని కూడా ఏపీలో నిలువరించవచ్చు. ఇక జాతీయ రాజకీయాల్లో బాబు అనుభవాలు, పరిచయాలతో కేసీయార్ కూడా దూకుడుగా వెళ్ళవచ్చు. అయితే మోడీతో ఇప్పటికిపుడు పేచీకి బాబు రెడీ అవుతారా అన్నదే ప్రశ్న‌. అందువల్ల జమిలి ఎన్నికల వంటివి పెడితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సీన్ మార్చేందుకు చంద్రులు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

Related Posts