YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ వైపు టీడీపీ ఓటు బ్యాంక్

బీజేపీ వైపు టీడీపీ ఓటు బ్యాంక్

హైదరాబాద్, డిసెంబర్ 15,
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకునేలా చేశాయి. హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులు ఎక్కువగా ఉంటారు. సీమాంధ్రులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో టీఆర్ఎస్ పాగా వేసింది. అయితే సీమాంధ్రులు బీజేపీ వైపు చూడకపోవడానికి గల కారణాలపై అన్ని రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అనుకూలంగా మారాయని చెప్పక తప్పదు.హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్నారు. ఏపీ నుంచి వచ్చి వ్యాపార, ఉద్యోగ పరంగా అనేక మంది ఇక్కడ స్థిరపడిపోయారు. కూకట్ పల్లిని మరో కోనసీమగా పిలుస్తారు. జూబ్లీహిల్స్ లో వ్యాపార కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇందులో అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అయితే తెలుగుదేశం మీడియా మాత్రం వైసీపీని టార్గెట్ చేసింది.ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోవడానికి కారణం వైసీపీ అని ప్రచారం చేస్తుంది. దీనిపై బీజేపీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు చెబుతున్నారు. వైసీపీ లోపాయికారిగా టీఆర్ఎస్ కు మద్దతు పలకడంతోనే బీజేపీ కి పెద్ద దెబ్బతగిలిందంటున్నారు. టీఆర్ఎస్ సాధించిన 55 స్థానాల్లో అత్యధికంగా ఈ ప్రాంతాల నుంచే రావడంతో బీజేపీ కూడా ఇందుకు గల కారణాలపై పోస్ట్ మార్టం నిర్వహిస్తోంది.ఈ ప్రాంతాల్లో టీడీపీ సానుభూతి పరులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అత్యధికంగా వీరే ఎక్కువ ఉన్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో టీడీపీ అనేకసార్లు విజయం సాధించింది. అయితే ఈసారి ఏపీ రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ టీడీపీ ఓటు బ్యాంకు మొత్తం టీఆర్ఎస్ వైపు మళ్లిందంటున్నారు. రాజధాని అమరావతి విషయంతో పాటు, జగన్ ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థిస్తుండటంతోనే టీడీపీ సానుభూతిపరులు బీజేపీకి హ్యాండిచ్చారంటున్నారు. దీంతోపాటు వ్యాపారపరంగా అధికార పార్టీ మద్దతు అవసరం అవ్వడంతో టీఆర్ఎస్ కే మద్దతు చెప్పారంటున్నారు. మొత్తం మీద టీడీపీ, వైసీపీ సానుభూతిపరులందరూ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి దూరమయ్యారని చెప్పక తప్పదు.

Related Posts