సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు డ్రగ్స్ వైపు టర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కొద్ది రోజులుగా పలువురు సెలబ్రిటీలని విచారిస్తూ వారి నుండి కీలక సమాచారాన్ని రాబడుతుంది. గత 45 రోజులలో సెలబ్రిటీలతో పాటు వారికి సంబంధం ఉన్న వారి దగ్గర నుండి 85 గాడ్జెట్స్‌ని ఎన్సీబీ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్ సైన్సెస్ డైరెక్టరేట్ (డిఎఫ్‌ఎస్) ఫోన్‌లో డాటాని వెలికితీస్తుండగా, 30 సెల్‌ఫోన్స్ నుండి పొందిన డాటాతో ముంబైలో దాడులు చేసి అరెస్ట్ చేస్తుంది ఎన్సీబిరియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్, సారా అలీ ఖాన్, అర్జున్ రాంపాల్, శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే మరియు వారి సహచరులకు చెందిన సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. సుశాంత్ మృతి కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. డ్రగ్స్ వ్యవహారాన్ని ఎన్సీబీకు అప్పగించింది. ఇప్పటికేఏ రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్‌లను ఎన్‌సిబి అరెస్టు చేసి, కొన్ని రోజులు కస్టడీలో ఉంచిన తరువాత వారికి బెయిల్ ఇచ్చారు. అంతేకాక పలువురు బాలీవుడ్ ప్రముఖులను, మాదకద్రవ్యాల సరఫరాదారులను కూడా ఎన్‌సిబి ప్రశ్నించింది.