YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ కు తీవ్రవమానం

కర్ణాటక  శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ కు తీవ్రవమానం

కర్ణాటక  శాసనమండలి రసాభాసాగా మారింది. సభ్యులు బాహాబాహీకి దిగి డిప్యూటీ ఛైర్మన్ ను కుర్చీలోంచి  లాగేసి తీసుకెళ్లారు. మండలి ఛైర్మన్ స్థానాన్ని తీవ్రంగా అవమానించారు. ఐదు రోజుల వాయిదా అనంతరం శాసనమండలి మంగళవారమే (డిసెంబర్ 15) తిరిగి ప్రారంభమైంది. మండలి ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ ధర్మగౌడను కుర్చీలో నుంచి లాగేశారు. ఈ పరిణామం ఒక్కసారిగా ఘర్షణకు దారి తీసింది. సభలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. కొందరు సభ్యులను మరికొందరు సభ్యులు బయటకు నెట్టేసుకున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. డోర్లు ఓపెన్ చేసి ఒకరినొకరు బైటకు నెట్టేసుకుంటుంటున్నట్లుగా కనిపిస్తోంది.బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. బీజేపీ జేడీఎస్ పార్టీలు ఛైర్మన్ ను ఆ స్థానంలో అక్రమంగా కూర్చొబెట్టాయని ధ్వజమెత్తారు. సభ అదుపులో లేనప్పుడు ఛైర్మన్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటక శాసనమండలిలో గోవధ నిషేధ బిల్లును ఆమోదించుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావించింది. ఈలోగా షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఈక్రమంలో మండలి ఛైర్మన్ ను కుర్చీలోంచి లాగేసిన కాంగ్రెస్ సభ్యులు ఆయనను బయటకు పంపించేశారు. శాసన మండలిలో బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందంటూ నినాదాలు చేశారు. చైర్మన్ ను కుర్చీలోంచి లాగేస్తున్న వీడియో బైటపడింది.కొంత మంది సభ్యులు గుండాల్లా ప్రవర్తించారని బీజేపీ ఎమ్మెల్సీ లెహర్ సింగ్ సిరోయా మండిపడ్డారు. మండలి వైస్ ఛైర్మన్ను కుర్చీలో నుంచి లాగేశారని తెలిపారు. 'మండలి చరిత్రలో ఇలా సిగ్గుతో తల దించుకోవాల్సిన చర్య ఎప్పుడూ చూడలేదు. ఈ ఘటన పట్ల మేం చాలా సిగ్గుపడుతున్నాం. ప్రజలు ఏమనుకుంటారు అనే కనీస ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు' అని ఆయన అన్నారు.

Related Posts