YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

బిజీబిజీగా జగన్

బిజీబిజీగా జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు.భారీ వర్షాలు, నివర్‌ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రహదారులు, ఆస్తి నష్టం గురించి వివరించి... తక్షణమే సహాయం అందించాలని ముఖ్యమంత్రి జగన్‌ కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అమిత్‌ షా దృష్టికి సీఎం తీసుకువెళ్లారు.అయితే, సీఎం ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయాంశాలే అత్యధికంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వర్గాలు చెబుతున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన 'భారత్‌ బంద్‌'కు వైసీపీ సర్కారు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. 700 మీడియా సమావేశాలు, 700 సదస్సులు నిర్వహించి.. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలే జరుగుతుందని వివరించాలని తీర్మానించింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ సదస్సులు విజయవంతం చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ను అమిత్‌ షా కోరిన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నేతలు కోరగానే అపాయింట్‌మెంట్‌ ఖరారు చేసి... వారు ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించి, అదే సమయంలో వ్యవసాయ చట్టాలకు సహకరించాల్సిందిగా అమిత్‌షా తనదైన శైలిలో కోరుతున్నట్లు సమాచారం.ఇందులో భాగంగానే ఏపీ సీఎం జగన్‌కు కూడా అపాయింట్‌మెంట్‌ లభించినట్లు చెబుతున్నారు. కేంద్రమే జగన్‌ను ఢిల్లీకి పిలిపించిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీలోనే బసచేసి బుధవారం ఉదయం తిరిగి అమరావతి వెళ్లిపోతారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీని, ఇతర మంత్రులను కలిసే అవకాశం లేదని స్పష్టం చేశాయి.కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఆదివారం హైదరాబాద్ వచ్చారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రిఅమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్, పలువురు కేంద్రమంత్రులను కలిసి వచ్చారు. కేసీఆర్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే సీఎం జగన్ కూడా ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్‌ హోం మంత్రి అమిత్ షాను కలిసిన మూడో రోజే జగన్‌ కూడా ఆయన్ను కలుస్తుండటం చర్చనీయాంశమైంది.

Related Posts