YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేం - హైకోర్ట్ కు తేల్చి చెప్పిన ఏపి ప్రభుత్వం

పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేం  - హైకోర్ట్ కు తేల్చి చెప్పిన ఏపి ప్రభుత్వం

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు‌లో మంగళవారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కరోనా వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని, ఈ వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని తెలిపింది. మొదటి డోస్ వేసిన నాలుగు వారాల తర్వాత రెండవ డోస్ వేయాలని కేంద్రం సూచించిందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ లాగానే వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని, ప్రజారోగ్యం దృష్ట్యా వాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందని అఫిడవిట్‌లో తెలిపింది. అందువలన ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అడిషనల్ అఫిడవిట్ తనకు గత రాత్రి అందిందని కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఎస్ఈసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వచ్చే శుక్రవానికి కేసు విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.

Related Posts