ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అరుణ్‌కుమార్ గోస్వామిని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా గోస్వామి ఉన్నారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం సోమవారం ఢిల్లీలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలని కొలీజియం తీర్మానించినట్లు తెలిసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబరు 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల రద్దు మొదలుకుని... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు అర్ధంతరంగా ఉద్వాసన పలకడం వరకు ఏపీ సీఎం జగన్ సర్కారు తీసుకున్న అనేక చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే.