YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

విజయశాంతికి అంత సీన్ ఉందా

విజయశాంతికి అంత సీన్ ఉందా

హైదరాబాద్, డిసెంబర్ 16, 
విజయశాంతికి అసలు విశ్వసనీయత ఉందా? ఆమెను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? ఆమె మాటలను నమ్ముతారా? అంటే నో అని చెప్పేవాళ్లే ఎక్కువగా కనపడతారు. ఇందుకు కారణం విజయశాంతి వైఖరి. నిజానికి సినిమా నటిగానే విజయశాంతికి ఛరిష్మా ఉంది. పొలిటికల్ లీడర్ గా విజయశాంతి పొడిచింది ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే విజయశాంతి టీఆర్ఎస్ లో ఉన్నప్పుడే ఒకింత క్రేజ్ ఉండేదన్నది కాదనలేని వాస్తవం.రాజకీయ నేత అన్నాక ప్రజల్లో నిత్యం తిరుగుతుండాలి. వారి సమస్యలపై స్పందిస్తుండాలి. తాను ఉన్నానన్న భరోసా ఇవ్వాలి. కానీ విజయశాంతిలో ఏ ఒక్క క్వాలిటీ కూడా లేదు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా విజయశాంతి ఇరగదీసింది ఏమీ లేదు. టీఆర్ఎస్ లో చేరిన తర్వాతనే విజయశాంతి పార్లమెంటులోకి అడుగుపెట్టగలిగారు. అది కూడా కేసీఆర్ పుణ్యమేనని చెప్పకతప్పదు. మెదక్ జిల్లా కేసీఆర్ సొంత జిల్లా కావడంతో సులువుగా విజయశాంతి నెగ్గగలిగారు.కానీ విజయశాంతికి తాను అందరికంటే అతీతమని వ్యవహరిస్తారు. ఎప్పుడో తప్ప ప్రజల్లోకి రారు. కాంగ్రెస్ లో దాదాపు ఆరేళ్ల పాటు ఉన్నా గాంధీ భవన్ మొహం చూసింది లేదు. కనీసం పార్టీ కార్యక్రమల్లో పాల్గొనలేదు. ప్రచార కార్యదర్శి పదవి ఇవ్వడంతో ఎన్నికల సమయంలో మాత్రం ప్రచారం చేశారు. నిజానికి విజయశాంతి ప్రచారంతో వచ్చి పడిన ఓట్లు ఏమైనా ఉన్నాయా? అంటే ఆమె కంటే బాబూ మోహన్ బెటర్ అని అంటారు. కనీసం బాబూ మోహన్ ఒక నియోజక వర్గంలోనైనా తన ప్రభావాన్ని చూపగలరు. కానీ విజయశాంతికి ఆ సీన్ కూడా లేదు.విజయశాంతి తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటారు. స్థానిక నాయకులంటే చిన్నచూపు. కాంగ్రెస్ లో చేరేటప్పుడు కూడా సోనియా, రాహుల్ సమక్షంలో చేరారు. ఇక తాజాగా బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కండువా కప్పేందుకు ప్రయత్నించినా తిరస్కరించారు. చివరకు జేపీ నడ్డా చేత కండువా కప్పించుకున్నారు. దీనికి ప్రధాన కారణం తనకు తాను టాప్ లీడర్ గా విజయశాంతి ఊహించుకోవడమే. నిజానికి ప్రజల్లో ఏమాత్రం ప్రభావం చూపని నేతగా విజయశాంతిని చూడాల్సి ఉంది. ఆమె ఏ పార్టీలో చేరినా పార్టీ కంటే ఆమెకే ఎక్కువ ఉపయోగం. పదవులివ్వడం కూడా విజయశాంతికి దండగే అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా విన్పిస్తున్నాయి. సినిమాల్లో విజయశాంతి సక్సెస్ అయ్యారేమో కాని, రాజకీయాల్లో మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యారని ఆమె పొలిటికల్ కెరీర్ ను చూస్తేనే అవగతమవుతుంది.

Related Posts