యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం క్రిస్మస్ వేడుకలు జరిగాయి... బయటి నుంచి వచ్చిన కొందరితో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ ఛార్జ్ సూపర్డెంట్ రవి ప్రకాష్ జిల్లా ఆస్పత్రిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సిబ్బంది తో కలిసి ప్రార్థనలు జరిపి ఆతరువాత కేకును కూడా కట్ చేశారు. అయితే ఇందులో ఇతర మతాల వారిని కూడా బలవంతంగా పాల్గొనేలా వైద్యుడు రవి ప్రకాష్ వత్తిడి చేశారని, ఆయన ప్రోద్బలం తోనే అక్కడ ప్రార్థనలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆ తరువాత కొంతమంది ఈ వీడియోని యుట్యూబ్ లో కూడా అప్లోడ్ చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో పలువురు రోగులు, సిబ్బంది నుంచి విమర్శలు వచ్చాయి.. ఆతరువాత హిందూ సంఘాల ప్రతినిధులు కొందరు ఆస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రకాష్ తో మాట్లాడేందుకు ప్రయత్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో అన్యమతస్తులకు పండగలు నిర్వహించడంలో ప్రోత్సహించడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఇటివల నల్లగొండ మండలం రాముల బండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్యమత ప్రార్థనలు నిర్వహించిన ఇద్దరు సిబ్బందిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మళ్లీ యాదాద్రి జిల్లా నడిబొడ్డులో ఉన్న జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నే ఇలాంటి మత పరమైన సంఘటనలు జరగడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నాట్లు సమాచారం.