YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

రైతుల పోరాటం చారిత్రాత్మకం: సిపిఐ(యం.ఎల్)

రైతుల పోరాటం చారిత్రాత్మకం: సిపిఐ(యం.ఎల్)

రైతు చట్టాలు రద్దు చేయండి మూడు విప్లవ సంస్థల డిమాండ్ కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మక మైందని, సిపిఐ(యం.ఎల్) రేడ్ ప్లాగ్ , సిపిఐ (యం.ఎల్) ప్రతిఘటన, సిపిఐ(యం.ఎల్) రాంచేంద్రన్ పార్టీల నాయకులు, మల్లేపల్లి ప్రభాకర్, షాకిషవలి, బుద్దసత్యనారాయణ అన్నారు. నేడిక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ రైతుల పోరాటం 130 కోట్ల మంది ప్రజలున్న దేశాన్ని ఏకం చేసిందని రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశం యూవత్తూ ఒక్కతాటిపైకి వచ్చిందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయన్ని రెట్టింపు చేస్తామని ప్రగాల్ఫాలు పలికిన మోడి తీరా అదికారంలోకి వచ్చిన తరువాత రైతులకు ఎంతో కోంత అందగా ఉన్న హక్కులను, చట్టాలను కార్పోరేట్లకు తాకట్టుపెట్టెలా విశ్వప్రయత్నాలు చేస్తున్నరని అగ్రహం వ్యక్తం చేశారు. డిల్లీ సరిహద్దుల్ల వేలాది మంది రైతు చలిలోనూ ప్రాణాలకు తెగించి తమ హక్కుల కోసం పోరాటం కోనసీగించడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టమని అన్నారు. అయినా మోడి ప్రభుత్వం చట్ట సవరణలు చేస్తాం త్ప్ప రద్దు చేయబోమని చేపడ్డం అత్యంత దారుణమన్నారు. దేశవ్యాప్తంగా సకల జనలు మూడు వ్యవసాయ చట్టాలను విద్యుత్ బిల్లులను వెనక్కి తీసుకోవాలని చేపట్టిన భారతబంద్ అరుదైన ఉద్యమం, రైతులు ఆందోళనకు బి.జె.పి. మినహ అన్ని రాజకీయ ప్రాటిలు , ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, న్యాయవాదులు, వైద్యులు, రైల్వేకార్మికులు, యువజన సంఘాలు, మహిళ, సమాజిక, ప్రభుత్వ, ప్రవేటు రంగాల ఉద్యోగులు ఏకమై మోడికి దిమ్మదిరిగే షాకిచ్చరని, హిందు, ముస్లింలు ఐక్యంగా ఉండాలంటే దేశంలో కాషాయ శక్తులను అడ్డుకోవల్సిన అవసరం ఉంది. దేశంలోని అన్ని ప్రాంతియ పార్టీలు రైతులకు మద్దతు ఇస్తున్నయనీ. ఇది శుభపరిణామలు, రైతు ఉద్యమం జయప్రదం అయ్యేవరకు మాపార్టి శ్రేనులు అన్ని రకాల ఉద్యోమంలో పాల్కొంటాయి.

Related Posts