YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ప్రణాళికా బద్ధంగా వరంగల్ నగరం నిర్మాణం: ఎర్రబెల్లి

ప్రణాళికా బద్ధంగా వరంగల్ నగరం నిర్మాణం: ఎర్రబెల్లి

హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ మహానగరం రాష్ట్రానికి రెండో రాజధానిగా వెలుగొందుతున్నది. వరంగల్‌ను ప్రణాళికా బద్ధంగా నిర్మించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కంకణ బద్దులై ఉన్నారని పేర్కొన్నారు.  గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో పాలక వర్గ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అలాగే వరంగల్ మహా నగర పాలక సంస్థలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుందన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం రూ.300 కోట్లు వరంగల్ కోసం బడ్జెట్ కేటాయిస్తుందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అమలు లోకి తెచ్చామన్నారు. వరంగల్లో ఇంటింటికీ ప్రతి రోజూ మంచినీరు విడుదల చేయనున్నామని తెలిపారు. కరోనా కారణంగా అన్ని పనులు ఆగి పోయాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ప్రజలు చైతన్యంతో వ్యవహరించాలన్నారు. కరోనా, వరదల సమయంలో ఈ పార్టీలు ఎక్కడకు పోయాయాయని ప్రశ్నించారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో కలిసి సమన్వయం చేసుకుంటూ, నగర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, అరూరీ రమేష్, చల్లా ధర్మా రెడ్డి, తాటికొండ రాజయ్య, కలెక్టర్, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts