కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహణపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. 31 మంది క్రికెట్ బుకీలు అరెస్ట్ చేశారు. పరారీలో మరింత మంది బుకీలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో 6 కేజీల గంజాయి, రెండు కార్లు, ఏడు ల్యాప్ టాప్ లు, రెండు కమ్యూనికేటర్ కిట్లు, క్యాలికులేటర్లు, రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ లో ఇప్పటి వరకు 35 కోట్ల రూపాయల మేర టర్నోవర్ అయినట్లు జిల్లా ఎస్పీ అన్బు రాజన్ వెల్లడించారు. బెంగుళూరు, హైదరాబాద్, గోవా నగరాలతో పాటు దేశ వ్యాప్తంగా నెట్ వర్క్ తో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రధాన బుకీల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.