రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఆదోనిలో పెట్టాలని తీసుకున్న ప్రతిపాదన ను మార్చాలని విద్యార్ధి సంఘాలు కోరాయి. ఎమ్మిగనూరు -ఆదోని నియెజకవర్గంల మధ్యలో ఉన్న బనవాసి లో ఏర్పాటు చేయాలి అని వారన్నారు. ఈ మేరకు ఎమ్మిగనూరు శాసనసభ్యుడు చెన్నకేశవరెడ్డికు పలు విద్యార్ధి సంఘాల నేతలు వినతిపత్రం ఇచ్చారు. విద్యార్ధి నేతలు మాట్లాడతూ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల ఆదోని ప్రాంతంలో ప్రతిపాదన కంటే ఎమ్మిగనూరు - ఆదోని నియెజకవర్గల మధ్యలో ఉన్న బనవాసి లో ఏర్పాటు చేస్తే అని రకాలుగా అభివృద్ధి అవుతుంది. ఇక్కడ వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. అందులో తాగునీటి సౌక్యరం ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం బనవాసి ఎడ్యుకేషన్ హబ్ గా ఉంది. కేంద్ర విద్య సంస్థ నవోదయ, రాష్ట్ర విద్య సంస్థలు గురుకులాలు, పశువైద్య విద్య సంస్థ (వెటర్నరీ డిప్లమో కళాశాల) కూడా ఉన్నాయి. అందులో జాతీయ రహదారి కూడా ఉంది అని. ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే అని రకాలుగా అభివృద్ధి అవుతుందని అన్నారు.