రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానుల కు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ఇన్చార్జి చిక్కం జానయ్య, ఆదోని డివిజన్ అధ్యక్షులు రామతీర్థం అమ్రేష్ మాదిగ, మంత్రాలయం తాలూకా అధ్యక్షులు మార్టిన్ హనుమన్నలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి సన్నెకి. కర్రెన్న మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నిరంతరం మాదిగ ల ఎదుగుదలకు , అభివృద్ధికి పాటుపడుతూ రాష్ట్రంలో ఉన్న మాతంగి వ్యవస్థను రూపుమాపి ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటాలు చేస్తూ యస్ సీ. వర్గీకరణ సాధించి జాతి ఎదుగుదలకు కృషి చేస్తామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు రాజధానులు మద్దతిస్తన్నామని పరిపాలన వికేంద్రీకరణ తోని అభివృద్ధి సాధ్యమని వారు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విధ్యకు పూర్తిగా మద్దతునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. రేషన్ కార్డు హోల్డర్ లకు మాత్రమే ఈ పథకాలు లబ్ది చేకూరుతుందని కేవలం మాదిగ మాల బీసీ కులాల వాళ్ళు మాత్రమే లబ్ధి చేకూరడం ఇష్టం లేక ప్రతిపక్షం వారు కోర్టులో కేసులు వేసి బహుజనుల ఆర్థిక అభివృద్ధిని అడ్డుకోవడం చాలా దారుణం అని అన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఎస్సీ మాదిగ హక్కుల కోసం పోరాటాలు చేసి అండగా ఉంటామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు ఆరిన్ , మారెన్న తదితరులు పాల్గొన్నారు.