నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కార్యాలయాల్లో కార్యాలయంలో 24వ డివిజన్, బాబూ జగజ్జీవన్ రామ్ కాలనీకి చెందిన బెల్లంకొండ వెంకయ్య మరియు వారి అనుచరులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో బుధవారం వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతిఒక్కరికి అండగా ఉంటూ, వారి గౌరవాన్ని కాపాడుతాం అన్నారు. నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా భవిషత్తులో బాబూ జగజ్జీవన్ రామ్ కాలనీని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందేలా చొరవతీసుకుంటాం అని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రియతమ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పనితీరు చూసి పార్టీలోకి చేరుతున్న ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు గ్రామీణ నియోజవర్గ కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు స్థానిక వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు