సరసమైన ధరలకే విమాన ప్రయాణ సర్వీసులను అందిస్తోన్న స్పైస్‌జెట్ అదిరిపోయే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని స్పైస్‌జెట్ ఈ బంపర్ ఆఫరిచ్చింది. ఈ ఆఫర్‌లో ప్రయాణికులు దేశీయంగా ఒకవైపు మాత్రమే ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రూ. 769కే ప్రారంభ ధరతో టికెట్లు కొనుగొలు చేయవచ్చునని సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అదే విధంగా విదేశీ వన్ వే ప్రయాణానికి 2,469 రూపాయల ప్రారంభ ధరతో టికెట్లను కొనుగోలు చేయవచ్చు.
ఈ ఆఫర్ జనవరి 25 వరకు అందుబాటులో ఉంటుందని స్పైస్ జెట్ ప్రకటించింది. పరిమిత కాలముండే ప్రమోషనల్ ఆఫర్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ ఈ సంస్థ పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది డిసెంబర్ 12లోపు ఎప్పుడైనా బుక్ చేసుకున్న తేదీల్లో ప్రయాణించవచ్చని స్పైస్‌జెట్ స్పష్టం చేసింది.
కాగా, స్పైస్‌జెట్ సగటున రోజుకి సుమారు 358 విమాన సర్వీసులను నడుపుతోంది. మొత్తం 46 గమ్యస్థానాలకు స్పైస్‌జెట్ విమానాలు నడుస్తున్నాయి. వీటిలో 39 దేశీయ గమ్యస్థానాలు కాగా, ఏడు అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి.