YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మిషన్ భగిరధ పనులను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి

మిషన్ భగిరధ పనులను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి

మిషన్ భగిరధ పనుల పురోగతిని రాష్ట్ర విద్యుత్,  ఎస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుక్రవారం ఉదయం పరిశీలించారు.  జిల్లా కలెక్టర్ కే.సురేంద్ర మోహన్ తో కలిసి అక్కడ నిర్మితమౌతున్న నీటిశుద్ధి కేంద్రాన్ని మే 5 నాటికి ట్రయల్ రన్ కు ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించారు. తరువాత అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సాహసానికి ప్రతీక మిషన్ భగీరధ. నిర్ణిత గడువు తేది లోపు పుర్తౌతున్న ఇంటింటికి మంచినిటి పధకం అని అన్నారు.  అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోటే పనులు వేగవంతం అవుతున్నాయని అన్నారు. తెలంగాణా ఆడపడుచులు మంచినీటికోసం రోడ్దేక్కోద్దన్నదే సి.యం కెసిఆర్ లక్ష్యం అని అన్నారు. చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా 2018 చివరి నాటికి ఇంటింటికి మంచినిరందించే మిషన్ భగీరధ పధకాన్ని పూర్తి చెయ్యకుంటే భవిష్యత్ లో ఏఎన్నికలలో పోటి చేసేది లేదంటూ స్వీయ నియంత్రణ పాటించి పనులను వేగవంతంగా పూర్తి చేసిన దీశాలి ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఆయన కొనియాడారు. మంచినీటి కోసం తెలంగాణా ఆడపడుచులు రోడ్డు ఎక్కోద్దన్నదే ఆయన లక్ష్యమంటూ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. మే 5 న సూర్యాపేటకు నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుండి అందించనున్న మంచినీటిని సూర్యాపేటకు సమీపంలోని ఇమాంపేట నీటిశుద్ధి కేంద్రం వద్ద ట్రయల్ రన్ ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. 

Related Posts