YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించాలి

జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించాలి

నివర్ తుఫాన్ బాధిత రైతులకు అండగా ఏర్పాటు చేసిన "రైతు కోసం దీక్ష" కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నక్కా ఆనందబాబు  ఈరోజు రైతాంగం కోసం రైతులతో,రైతు కూలీలతో, మహిళా సోదరీమణులతో కలిసి పెద్ద ఎత్తున తెనాలిలోని మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్ ముందు ఏర్పాటు చేసిన ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించాలి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి రాష్ట్రంలో దగ్గర దగ్గర 114 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున రైతాంగానికి పంట నష్టం జరిగింది.
పూర్వకాలంలో పెద్దవాళ్ళు చెబుతుండే వాళ్ళు పచ్చి కరువు వచ్చిందని, ఇవాళ ఒక్క పంట కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు కనీసం పశువులు తినే గడ్డి కూడా కరువైన పరిస్థితి. తడిసి రంగు మారిన ధాన్యం, పంట కోసే పరిస్థితిలో లేదు. వరి కోత మిషన్తో కోయించాలి అంటే గతంలో గంట పడితే ఇప్పుడు 3-4 గంటల సమయం పడుతుందని అయనఅన్నారు.
రైతుకు 10 ౼ 14 బస్తాలు చేతికొచ్చే పరిస్థితి లేదు. 14 వందల పైన అమ్మాల్సిన 75 కిలోల ధాన్యం బస్తా దళారులు 950 రూపాయలకు కొట్టుకు వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం చేతికి వచ్చిన కొద్ది పంటను కూడా దళారుల పాలు చేస్తున్నారు.
 మార్కెట్ యార్డ్లను నిర్వీర్యం చేసి రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు. ఆ రైతు భరోసా కేంద్రాలలో సీసీ కెమెరాలు పెట్టండి అక్కడ జరిగే నిర్వకాలు అన్ని మీకు తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు. మీ వాలంటీర్ వ్యవస్థ, మీ సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో వ్యవస్థలన్నీ బ్రష్టు పట్టించారు. మీ పార్టీ కార్యకర్తలకు, మీ నాయకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఇవాళ ఉన్న రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారు
గతంలో మోతాదు, వీఆర్వో, తాసిల్దార్, విలేజ్ సెక్రటరీ వీరందరూ కలిసి ఒక వారం నుంచి పది రోజుల్లోపు పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని నమోదు చేసి వాళ్ళు కలెక్టర్, ఆర్డీవో, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళు అందరూ గ్రామాలలో పర్యవేక్షించే వాళ్ళు. వీళ్లందరి సమన్వయంతో 15 రోజుల లోపు నివేదిక ప్రభుత్వానికి అందేది. కానీ మీరు ఈ వ్యవస్థలను అన్నింటిని భ్రష్టు పట్టించడం వల్ల ఇవాళ ఇక్కడ ఉన్న రైతులని అడగండి ఒక అధికారి అయినా పొలం లోకి వచ్చాడా..?, ఒక్క అధికారి అయినా పంట నష్టం నమోదు చేశాడా..?
5800 రూపాయలు అమ్మాల్సిన "పత్తి" గ్రామాల్లో దళారులు 2500 - 3000 రూపాయలకు కొట్టుకు వెళ్తున్నారు. స్పిన్నింగ్ మిల్లులు జిన్నింగ్ మిల్లులు మీ రాజకీయ నాయకుల, ఎమ్మెల్యేల అవతారాలు ఎత్తి పత్తిని దోచుకుంటున్నారు.
మిర్చి రైతు కష్టాలు వర్ణనాతీతం. ఒక క్వింటా మిర్చి కూడా రైతు చేతికి వచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో స్వభావులు 4 - 5 వేల వరకు అమ్మింది. ఇవాళ అదే సుబాబులు టన్ను 1000 రూపాయలకు కూడా కొనే దిక్కులేదు , కార్పొరేట్ వ్యవస్థలన్నీ దోచుకుంటున్నాయి. మొక్కజొన్న నల్ల గింజ వచ్చిందని దళారులు 1000 రూపాయలకు దోచుకుంటున్నారు. 1800 అమ్మాల్సిన మొక్కజొన్న 1000 రూపాయలకు దోచుకు వెళ్తున్నారు
ఈ ప్రభుత్వం ఏ పంటకు మద్దతు ధర ఇచ్చి ఏ పంటను కాపాడారో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి ని ప్రశ్నిస్తున్నాం. నిన్న మీ డబ్బా పేపర్లో, మీ దొంగ పత్రికలో, ఈ ఫేక్ పత్రికలో 1250 కోట్ల రూపాయలు పంట నష్టపరిహారం ఇచ్చామని చెప్పి అసత్య ప్రచారం చేసావు. వాస్తవంగా మీరు ఇచ్చింది 921 కోట్ల రూపాయలు. మా పట్టాభి లెక్కలన్నీ వెలికితీశారు, 13 జిల్లాలలో సాక్షి లో ప్రచురించిన లెక్కలన్నీ తీస్తే 921 కోట్ల రూపాయలు వచ్చింది. మీ పత్రికలో 1252 కోట్ల రూపాయలు చెల్లించామని వేశావు. మీరు చెప్పేది ఫేక్ మాటలు అని ఎప్పుడూ చంద్రబాబునాయుడు గారు చెప్తున్నారు. ఈ ముఖ్యమంత్రి ఫేక్ ముఖ్యమంత్రి, ఈయన చెప్పే మాటలు ఫేక్ మాటలు, ఆయన పత్రిక ఒక  ఫేక్ పత్రిక అని చంద్రబాబునాయుడు గారు చెప్పిన మాటలు వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఇవన్నీ అడుగుతుంటే మీకు కోపం వస్తుంది.
నిన్న ఢిల్లీ వెళ్లి హోంమంత్రి గారిని కలిశావు, నువ్వు అక్కడే ఇచ్చిన కాగితాన్ని బయట పెట్టగలవా..?. హోం మంత్రి గారికి ఇచ్చిన కాగితం బయట పెట్టే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి కి ఉందా..?. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లావు ప్రధానమంత్రి గారిని కలిసినా లేక హోం మంత్రి గారిని కలిసినా ఎప్పుడైనా ఢిల్లీలో మీడియాతో మాట్లాడావా..?, ఇవాళ చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లావు. ప్రజల డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అక్కడ ఏం జరిగిందో, ఏం మాట్లాడావో, ఏమి అడిగావో, ఏం కాగితాలు ఇచ్చావో మీడియా ముందు ఎందుకు పెట్టడం లేదు..?. ఢిల్లీలో పెట్టలేదు, కనీసం అమరావతిలోని తాడేపల్లి రాజప్రసాదంలో నైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను. దేనికోసం వెళ్లావు..! కాళ్ల బేరానికి వెళ్ళావా..?, లేదా ప్రత్యేక హోదా అడగడానికి వెళ్ళావా..?. ఆ కాగితం బయట పెట్టు..?, లేక ప్రజలు అంశాల గురించి అడగడానికి వెళ్ళావా..? ఆ కాగితాలు బయట పెట్టు. రెండు రాష్ట్రాల మధ్య లక్షకోట్ల చెల్లింపులు పంచాయతీ ఉంది దాని గురించి అడగడానికి వెళ్ళావా..?, విద్యుత్ బకాయిలు పది కోట్ల రూపాయలు లావాదేవీలు ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల మధ్య దాన్ని అడగడానికి వెళ్ళావా..?, లేదా విద్యుత్ ఉద్యోగుల సమస్య ఉంది దాని గురించి అడగడానికి వెళ్ళావా..?, పోలవరం అంచనాలు ఏమయ్యాయి చెప్పే దమ్ము ధైర్యం మీకుందా..?. ఇవ్వాళ దేనికి కూడా జగన్ మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు
రైతాంగం కళ్ళల్లో ఇవ్వాళ కన్నీళ్లు కాదు నెత్తురు వస్తుంది. కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ లో ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు వారాలు తిరక్కుండా ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో మేము పర్యటనకు పెదనందిపాడు, చిన్న నందిపాడు, పర్చూరు ఆ ప్రాంతాలకు వెళ్తే రమేష్ అనే రైతు 40 ఎకరాలు మిర్చి వేసి కష్టాలన్నీ చూపించారు. మిర్చి మూడు సార్లు వేసాడు ఒక మొక్క 3 - 4  రూపాయలకు తీసుకొచ్చాడు. పదివేల మొక్క తీసుకొచ్చి వేసాడు మొదటి విడత 30000 అయింది, రెండో విడత 30000 అయింది, మూడో విడత 30000 అయింది. ఖర్చులన్నీ కూడా కలిపి ఒక లక్ష రూపాయలు అయింది. ఈ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ పురుగుమందు తాగి చనిపోయాడు. అంటే కౌలు రైతు గుండె పగిలి చనిపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
ఇవాళ పెద్ద ఎత్తున తన యొక్క కష్టాలు రైతాంగం యొక్క బాధలు చెప్పడానికి తెనాలి వేదికగా శ్రీనివాస రెడ్డి గారు, మాణిక్యాల రావు గారు రైతు సోదరులు అందరూ కూడా వచ్చారు. చాలా పెద్ద ఎత్తున  చైతన్యం కలిగిన ప్రాంతం ఇది. దీన్ని "ఆంధ్రాప్యారిస్" అంటారు. ఇవాళ ఈ "ఆంధ్రాప్యారిస్" రైతుల కన్నీళ్ళతో కష్టాలతో, బాధతో, ఆవేదనతో ఈ దెబ్బతిన్న పంటలను కూడా ముందు పెట్టుకొని కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా దెబ్బతిన్న పంటలను రైతాంగానికి అండగా ఉండి ధైర్యం చెప్పి రైతు దెబ్బతినకుండా రైతు కుటుంబాలు, కౌలు రైతు కుటుంబాలు దెబ్బతినకుండా ఇవాళ వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి రైతు సోదరులకు అండగా ఉండటానికి నారా చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తప్పకుండా ఇవాళ ఏ పంట కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నష్టపరిహారం మొత్తం కూడా వెంటన చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
రేపు అమరావతి లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది అమరావతి ప్రజా రాజధాని ఉద్యమం 365 రోజులు పూర్తి చేసుకుంటుంది రేపు 17 వ తారీకు 365 రోజులు పూర్తవుతుంది అమరావతి మీద నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 365 రోజులు అయింది ఏదైతే ఆరోజు 17వ తారీకు ఉద్యమాన్ని ప్రారంభం చేశారు మళ్లీ అదే 17 వ తారీఖున పెద్దఎత్తున బహిరంగ సభ జరుగుతుంది అమరావతి ప్రజా రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్ లో నారా చంద్రబాబునాయుడు గారు కూడా ఆ బహిరంగ సభ కు అన్ని రాజకీయ పక్షాలతో కలిసి పాల్గొంటారు ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పక్షాల నేతలు రైతులు ఆ బహిరంగ సభలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున రేపు జరగబోయే అమరావతి రాజధాని ఉద్యమాన్ని రైతాంగానికి మద్దతుగా మహిళలు రైతులు రైతు కూలీలు చేస్తున్న సంవత్సర ఉద్యమానికి వాళ్లు తిన్న దెబ్బలు కానీ వాళ్ల మీద పడ్డ లాఠీలు కానీ వాళ్ల మీద పెట్టిన మూడు వేల కేసులు కానీ వీటన్నింటికీ కూడా పెద్ద ఎత్తున వారికి సంఘీభావం తెలియ చేయడమే కాకుండా ప్రభుత్వం స్పష్టంగా అమరావతి ప్రజా రాజధాని మన రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించే వరకు కూడా ఉద్యమం ముందుకు వెళుతుంది అని చెప్పడానికి మీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతానికి రేపు ఉదయం 10:00 కు చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా అమరావతి రాజధాని ఉద్యమంలో భాగస్వాములు కావాలని అందరికీ పిలుపునిస్తున్నామని అయన అన్నారు.

Related Posts