YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పనబాక పోటీ చేస్తారా...

పనబాక పోటీ చేస్తారా...

తిరుపతి, డిసెంబర్ 17, 
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరగబోతోంది. అయితే ఎన్నడూ లేని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి అభ్యర్థిని ప్రకటించారు. మరోసారి పనబాక లక్ష్మి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించారు. ఇది ఎవరూ ఊహించని విషయం. చంద్రబాబు ఏ ఎన్నికలోనూ ఇంత త్వరగా అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ముందు ప్రకటించి తప్పు చేశామా? అన్న టెన్షన్ టీడీపీ నేతలకు పట్టుకుంది.అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీఫారం తీసుకుని కూడా పార్టీ మారిన నేతలున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆయన టీడీపీ ఇచ్చిన బీఫారంను కాదని వైసీపీలోకి వెళ్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరుపతిలో మరోసారి అదే రిపీట్ అవుతుందా? అన్న చర్చ టీడీపీలోనే జరుగుతుండటం విశేషంనిజానికి తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడం పనబాక లక్ష్మికి సుతారమూ ఇష్టం లేదు. పనబాక లక్ష్మి తన రాజీకీయ భవిష్యత్ కోసం బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. బీజేపీ నుంచే పోటీ చేయాలని ఆమె భావించారట. ఇదే సమయంలో చంద్రబాబు పనబాక లక్ష్మిని తిరుపతి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే తనకు పోటీ చేసేంత ఆర్థిక స్థోమత లేదని, తనను తప్పించాలని పనబాక లక్ష్మి దంపతులు చంద్రబాబుతో మొరపెట్టుకున్నా తానున్నానని హామీ ఇచ్చి పంపినట్లు తెలిసింది.అయితే పనబాక లక్ష్మి చివరి నిమిషంలోనైనా పోటీ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అది మరింత అవమానకరమని, అందుకే ఆమెను అభ్యర్థిగా చేసిన ప్రకటనపై పునరాలోచించాలని కొందరు నెల్లూరు, చిత్తూరు జిల్లాకు చెందిన నేతలు చంద్రబాబును కోరినట్లు తెలిసింది. అయితే పనబాక లక్ష్మితో తాను మాట్లాడానని, అలాంటిదేమీ జరగదని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద పనబాక లక్ష్మి వ్యవహారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.

Related Posts