ప్రభుత్వ ఆసుపత్రిల పనీతీరు మెరుగుపడాలని బిజేపి ప్లోర్ లీడర్ కిషన్ రెడ్డి అన్నారు శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రం లో మాతా శీశు అరోగ్య కేంద్రాన్ని అయన సందర్శిచారు సంగారెడ్డి జిల్లా హాస్పిటల్ లో సిబ్బంది కోరత తీవ్రంగా ఉందని అయన అన్నారు. ఎమ్మారై స్కానింగ్, గర్బిణిలకు అవసరమైన స్కానింగ్ పరికరలు ఇప్పటివరకు ఎర్పాటు చెయకపోవటం బాధాకరమని అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో తెరాస ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నేరవేర్చలేదు. మండల కేంద్రంలో 30 పడకలు, నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చెస్తామన్న తెరాస ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని అన్నారు. అలాగే, సంగారెడ్డి ఆసుపత్రిలో కనీస వేతనాల అమలు కావడంలేదని అన్నారు. తెలంగాణలో ఉన్న ఆసుపత్రులు అన్నీ తిరుగుతాం. ప్రభుత్వ హాస్పిటల్ లో డాక్టర్ల కోరత ఉన్నది. ముగ్గురు డాక్టర్ల స్థానం లో ఒక్కరు మత్రమే ఉన్నారని అన్నారు.