YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మారుతున్న తమిళనాడు రాజకీయాలు

మారుతున్న తమిళనాడు రాజకీయాలు

చెన్నై, డిసెంబర్ 17, 
రజనీకాంత్ ఎట్టకేలకు పార్టీ పెడతారని ప్రకటించారు. దీంతో తమిళనాడు రాజకీయాలు మారనున్నాయి. ప్రధానంగా రజనీకాంత్ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుందన్న చర్చ సర్వత్రా జరుగుతుంది. రజనీకాంత్ పార్టీ పెడతారని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతుంది. 2017లో తాను కొత్త పార్టీ పెడుతానని రజనీకాంత్ ప్రకటించారు. అందుకు తగినట్లుగా రజనీ మక్కల్ మండ్ర పేరుతో సభ్యత్వాలను చేర్పించే కార్యక్రమాన్ని కూడా రజనీకాంత్ ప్రారంభించారు.సభ్యత్వాల సంఖ్య కోటిన్నర దాటినట్లు చెబుతున్నారు. అయితే రజనీకాంత్ గత కొంతకాలంగా పార్టీని ప్రకటించడం లేదు. దీంతో అభిమానుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎంకే నుంచి రజనీకాంత్ కు బెదిరింపులు వచ్చాయని, అందుకే వెనక్కు తగ్గారన్న వదంతులూ విన్పించాయి. అయితే రజనీకాంత్ వీటన్నింటినీ కొట్టిపారేశారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యనేతలతో సమావేశమైన రజనీకాంత్ పార్టీ విషయమై చర్చించారు.అయితే రజనీకాంత్ పార్టీ పెడుతుండటం డీఎంకేకు ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశముంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును డీఎంకేకు వెళ్లకుండా రజనీకాంత్ పార్టీ సొంతం చేసుకునే అవకాశముందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. డీఎంకే కు ఇప్పుడు అన్ని రకాలుగా పరిస్థితి అనుకూలంగా ఉంది. ఉప ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి ఊపు మీదున్న డీఎంకేకు రజనీకాంత్ ఎంట్రీతో దెబ్బపడే అవకాశముంది.రజనీకాంత్ రాజకీయాల్లోకి రారనుకున్నారు. ఆయన తాను ముఖ్యమంత్రి అభ్యర్థి కానని ప్రకటించిన వెంటనే డీఎంకే ఈ విధమైన అంచనాలు వేసింది. అయితే ఇప్పుడు రజనీకాంత్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించగానే డీఎంకే నేతలు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. రానున్న రోజుల్లో రజనీకాంత్ పై మాటల దాడి చేసే అవకాశముంది. రజనీకాంత్ నాన్ లోకల్ అంటూ అన్ని పార్టీలూ నినదించేందుకు రెడీ అయిపోతారు. మరి రజనీకాంత్ వేటు నుంచి ఎవరు తప్పించుకుంటారు? ఎవరు బలవుతారన్నది తెలియాల్సి ఉంది.

Related Posts